CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు శాసనమండలిలో సీఎం మాట్లాడారు.
‘ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57లక్షల జీతం తీసుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని గతంలో కేసీఆర్ అన్నారు. కానీ మేం అధికారంలోకి వచ్చాక ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేశాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా రికార్డ్ స్థాయిలో పంట పండింది. గత ప్రభుత్వం తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకున్నారు. కానీ మేం అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’ అని సీఎం రేవంత రెడ్డి వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్ విధానాలే గవర్నర్ ప్రసంగలో ఉంటాయి. స్టేచర్ పై మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణం వారి అప్పులే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. మేం అధికారం లోకి వచ్చిన ఏడాదిలో రుణమాఫీ చేశాం. ఎన్నికల కోడ్ సాకుతో కేసీఆర్ రైతుబంధు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక అది కూడా చెల్లించాం. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం. రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇచ్చే పథకం తీసుకొచ్చాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: OFMK Recruitment: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. జీతం రూ.60,000.. ఈ అర్హత ఉంటే చాలు..