BigTV English

CM Revanth Reddy : హామీ నిలబెట్టుకున్న సీఎం.. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షల సాయం..

CM Revanth Reddy : హామీ నిలబెట్టుకున్న సీఎం.. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షల సాయం..

CM Revanth Reddy : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి CM రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్‌ను సచివాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు.


ఈ నెల 23న గిగ్ వర్కర్స్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో CM రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆ భేటీలోనే స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. 4 నెలల కిందట ప్రమాదవశాత్తూ స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించాడని, అతని కుటుంబానికి ఆనాటి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమోనని తాను ఎదురుచూశానని, కానీ KCR సర్కారు ఏమీ చేయలేదని CM రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని వెంటనే ఆర్థిక సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లోనే అధికారులు స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబం వివరాలు తెలుసుకున్నారు. వారిని సచివాలయానికి పిలిపించిన CM రేవంత్‌రెడ్డి.. 2 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్న తమను ముఖ్యమంత్రి ఆదుకోవడంపై ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×