BigTV English

Guntur Kaaram: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లో భయం.. దర్శకుడిపై ట్రోల్స్!

Guntur Kaaram: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లో భయం.. దర్శకుడిపై ట్రోల్స్!

Guntur Kaaram: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజా సజ్జ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హనుమాన్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే రోజున సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కానుండటంతో ప్రేక్షకాభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. దీంతో మహేశ్ అభిమానులకు కొంత భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ భయం మరేదో కాదు.. ‘హనుమాన్’.


‘హనుమాన్’ మూవీకి ఫస్ట్ నుంచి విశేష స్పందన వస్తుంది. అదీగాక రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ‘హనుమాన్’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేయించడానికి చాలా మంది ట్రై చేస్తున్నారని.. ఇటీవల ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైన అనుకున్న డేట్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. దీంతో సహించలేని ‘గుంటూరు కారం’ ఫ్యాన్స్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. దేవుడి సెంటిమెంట్‌తో గుంటూరు కారం సినిమాను బీట్ చేయాలని చూస్తున్నారంటూ ప్రశాంత్ వర్మపై ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అటు హనుమాన్ టీం కూడా గుంటూరు కారం సినిమాను తక్కువ అంచన వేయడం లేదు. ప్రేక్షకుల్లో మహేశ్‌కున్న క్రేజ్.. డైరెక్షన్‌లో త్రివిక్రమ్ మార్క్‌.. వారి ట్రాక్ రికార్డ్ చూసి ‘హనుమాన్’ టీంకి కూడా లోలోపల భయం పట్టుకుంది. అందుకే హనుమాన్ రిలీజ్ డేట్ ను జనవరి 12 కాకుండా రెండు మూడు రోజుల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కానీ, ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తే హనుమాన్ జనవరి 12నే విడుదల చేయబోతున్నారని అర్థమవుతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో కంటెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఫస్ట్ రోజునే తేలిపోతుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×