Illu Illalu Pillalu Today Episode july 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వచ్చి మాకు తల్లిదండ్రులు దగ్గర లేరు మీరే మాకు అన్ని అని ఎమోషనల్ గా కరిగిపోయేలా మాట్లాడతారు. వాళ్ళ మాటలకి వేదవతి కరిగిపోతుంటే.. శ్రీవల్లి వచ్చి అత్తయ్య గారిని ఇలా అంటారా అని మధ్యలో పుల్లలు పెట్టేస్తుంది. వేదవతి మనసులో మళ్లీ కోపాన్ని ద్వేషాన్ని పెరిగేలా చేస్తుంది.. అమ్మయ్య వేదవతి వీరిద్దరిపై సీరియస్ గానే ఉందని అనుకుంటుంది. వీళ్ళు ఇద్దరినీ ఇంట్లోంచి ఎలాగైనా బయటికి వెళ్లగొట్టాలని శ్రీవల్లి అనుకుంటుంది.. రామారాజు పెత్తనం మొత్తం శ్రీవల్లికి ఇస్తాడు. భర్తలకు దూరంగా ప్రేమ, నర్మదలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటి పెత్తనం చేతికి వచ్చిందని శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. బుల్లెట్ బండి పై హీరోయిన్ లాగా తన పుట్టింటికి వెళ్తుంది. వల్లిని చూసి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతారు. ఇంటి తాళాలు నా చేతికి వచ్చాయి ఇది చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఆ తర్వాత నువ్వు నా కూతురు అనిపించుకున్నవే అని భాగ్యం మెచ్చుకుంటుంది.. ఆ ఇంట్లోనే ఇద్దరికి కోడల్ని బయటికి పంపించేసి ఆస్తి మొత్తాన్ని నీ చేతికి దక్కేలా చేసుకో అని భాగ్యం సలహా ఇస్తుందే. నువ్వే ఏం చెప్తే అదే చేస్తాను అమ్మా అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ప్రేమ అన్నారు కదా ఇద్దరూ మావయ్య ఇలా చేస్తారని అసలు ఊహించలేదు అక్క అని మాట్లాడుకుంటూ ఉంటారు..
శ్రీవల్లి ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంటారు. దొంగకు పెత్తనం ఇచ్చినట్టు మావయ్య గారు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని మాట్లాడతారు. ఇదంతా పక్కన పెడితే మీరు సంతోషంగా ఉన్నారా అని నర్మదా అడుగుతుంది. అప్పుడే ధీరజ్ డెలివరీ కోసం అటుగా వెళ్తాడు. ప్రేమ అరుస్తున్న కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నర్మదా ధీరజ్ నీపై ఇంకా కోపంగా ఉన్నాడా అని అడుగుతుంది.. అదేమీ లేదక్కా ఏదో డెలివరీ కోసం అర్జెంటుగా వెళుతున్నాడని అర్థం అవుతుంది అని కవర్ చేస్తుంది.
ఆ తర్వాత ప్రేమ నర్మదను భావ నీతో మామూలుగానే ఉంటున్నాడని అడుగుతుంది. మామూలుగానే ఉంటున్నాడు మొదట కోపంగా ఉన్న ఇప్పుడు కూల్ అయ్యాడని నర్మదా అంటుంది. పోనీలే అక్క నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని నేను చాలా భయపడ్డాను. మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి నేనే కారణం అని బాధపడ్డాను కూడా అనే ప్రేమ ఉంటుంది. అప్పుడే అటుగా వచ్చిన సాగర్ నర్మదను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ప్రేమ ఏంటక్కా నీ మీద కోపం లేదు అన్నావ్ మరి బావా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అని అడుగుతుంది. ఆయన నేను ఏదో తప్పు చేశానని అనుకుంటున్నాడు. ఇంట్లో జరుగుతున్న గొడవలు అన్నింటికి కారణం నేనే అని ఫీల్ అవుతున్నాడు అని నర్మదా అంటుంది. ఇదంతా నావల్లే అక్క నేను బాధపడకూడదు అని అబద్ధం చెప్పాను ప్రేమ అంటుంది.. సరేలే ఇంటికి వెళ్దాం పదండి నర్మదా ప్రేమ ఇద్దరూ వెళ్తారు.
వేదవతి బాధపడుతూ కనిపించడం చూసిన తిరుపతి.. ఏంటి అక్క నువ్వు ఏడుస్తున్నావ్.. ఏమైంది? బావ నిన్ను ఎన్నోసార్లు అని అంటాడు ఇప్పుడు నువ్వు కొత్తగా బాధపడుతున్నావు ఏంటి అని కామెడీ చేస్తాడు. దానికి ఇంకాస్త సీరియస్ అయిన వేదవతి తిరుపతి చంప పగలగొడుతుంది. అది చూసిన నర్మదా ప్రేమలో తిరుపతిని తన పుట్టింటికి తీసుకెళ్లినట్టు చేయండి అత్తయ్య బాధ పోతుంది అని అంటారు.
తిరుపతి వెళ్ళి మరోసారి చెంప దెబ్బలు తింటారు. ఇదిగో నీ కోడలు ఇద్దరు ఎలా తీసుకెళ్ళు అత్తయ్య బాధ పోతుంది అని చెప్పారు అని అంటాడు తిరుపతి. వేదవతి మాత్రం కోడళ్లని దూరం పెడుతుంది. ఆ తర్వాత పడుకోవడం చూసిన శ్రీవల్లి పెత్తనం నా చేతికి చిక్కినట్టే ఇద్దరు కోడల్ని కంట్రోల్ లో పెట్టాలి అని అనుకుంటుంది. ప్రేమ నిద్రపోవటం చూసి ఎలాగైనా రీవైంజ్ తీర్చుకోవాలని అనుకుంటుకుంది. నీళ్లు కొట్టి లేపుతుంది. ఏంటక్కా బుద్ధి లేకుండా నిద్రపోతున్న దానిమీద నీళ్లు కొట్టావని ప్రేమ అరుస్తుంది.
Also Read: బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
రెస్ట్ తీసుకోడానికి ఇది ఏమైనా నీ పుట్టిల్లు కాదు కదా.. నిద్రపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని ప్రేమ ఉంటుంది.. ఇంట్లో పని ఏంటి? అయినా నాకు పొద్దునే లేచి పని చేసే అలవాటు లేదు ఇక మీద లేవను కూడా అని ప్రేమ ఉంటుంది. పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఇంటి పని చేయాల్సిందే అని శ్రీవల్లి అంటుంది.. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని ప్రేమ అంటుంది. మావయ్య గారు నా చేతికి పెత్తనం ఇచ్చారు కదా.. అందర్నీ దారిలో పెట్టాలి అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి ప్రేమల మధ్య మాటలు యుద్ధం మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి యవ్వారం బయటపడుతుందేమో చూడాలి..