BigTV English

Rythu Bharosa Scheme: ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.. జిల్లాల వారీ వివరాలివే.. ఓసారి చెక్ చేసుకోండి

Rythu Bharosa Scheme: ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.. జిల్లాల వారీ వివరాలివే.. ఓసారి చెక్ చేసుకోండి

Rythu Bharosa Scheme: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు ఖాతాల్లో రైతు భరోసాను జమ చేసింది. జనవరి 26 నుండి రైతు భరోసాను ఖాతాల్లో జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, అన్నట్లుగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా నగదు జమపై మంత్రి మాట్లాడుతూ.. 4,41,911 మంది రైతుల ఖాతాలలో రూ. 569 కోట్లు జమ చేశామన్నారు.  సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ. 6000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేశామన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభమైన పథకం, నేడు కార్యరూపం దాల్చిందని మంత్రి అన్నారు.


జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని, విడుదల చేసిన నిధులు సోమవారం రైతుల అకౌంట్లలో జమ చేయబడ్డాయన్నారు. మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతు భరోసా నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీ జరుగుతుంది కనక కొన్ని జిల్లాలలో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనపడ్తుందన్నారు.

జిల్లాల వారిగా విడుదలైన రైతుభరోసా నిధుల వివరాలు
ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలలోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు 14.49 కోట్లు, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 23 మండలాలోని 25 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు, హన్మకొండ జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 12,545 రైతులకు 14.30 కోట్లు, జగిత్యాల జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు, జనగామ జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు 15.91 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 7,073 రైతులకు 8.67 కోట్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 7,829 రైతులకు 12.47 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 22 మండలాలోని 24 గ్రామాలకు చెందిన 9,062 రైతులకు 8.35 కోట్లు జమయ్యాయి.


కరీంనగర్ జిల్లాలో 15 మండలాలోని 15 గ్రామాలకు చెందిన 14,226 రైతులకు 15.96 కోట్లు, ఖమ్మం జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు 28.42 కోట్లు, కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలోని 19 గ్రామాలకు చెందిన 4,344 రైతులకు 8.62 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలోని 19 గ్రామాలకు చెందిన 14,611 రైతులకు 18.14 కోట్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 16 మండలాలోని 16 గ్రామాలకు చెందిన 14,575 రైతులకు 17.27 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 16 మండలాలోని 17 గ్రామాలకు చెందిన 7,143 రైతులకు 8.72 కోట్లు, మెదక్ జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు 14.06 కోట్లు, మేడ్చల్ జిల్లాలో 5 మండలాలోని 5 గ్రామాలకు చెందిన 2,706 రైతులకు 3.14 కోట్లు, ములుగు జిల్లాలో 9 మండలాలోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు 8.26 కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

అలాగే నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 16,806 రైతులకు 23.05 కోట్లు, నల్లగొండ జిల్లాలో 31 మండలాలోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు 46.93 కోట్లు, నారాయణపేట జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు 13.87 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18 మండలాలోని 18 గ్రామాలకు చెందిన 7,912 రైతులకు 10.56 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 31 మండలాలోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు 46.93 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 9,885 రైతులకు 10.14 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 9,724 రైతులకు 12.26 కోట్లు

రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 15,597 రైతులకు 20.32 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలోని 25 గ్రామాలకు చెందిన 19,933 రైతులకు 24.15 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 26 మండలాలోని 26 గ్రామాలకు చెందిన 31,170 రైతులకు 36.76 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 23 మండలాలోని 23 గ్రామాలకు చెందిన 29,352 రైతులకు 37.84 కోట్లు, వికారాబాద్ జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 8,609 రైతులకు 11.18 కోట్లు, వనపర్తి జిల్లాలో 15 మండలాలోని 15 గ్రామాలకు చెందిన 9,441 రైతులకు 12.25 కోట్లు, వరంగల్ జిల్లాలో 11 మండలాలోని 11 గ్రామాలకు చెందిన 11,386 రైతులకు 12.86 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలోని 17 గ్రామాలకు చెందిన 17,576 రైతులకు 26.95 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.

Also Read: Minister Seethakka: కేటీఆర్.. ఆవేశం తగ్గించుకో.. ఆలోచన పెంచుకో.. మంత్రి సీతక్క సూచన

మొత్తంగా 32 జిల్లాలలోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాలలోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి, వారి వారి ఖాతాలలో మొత్తం రూ. 569 కోట్లు జమ చేయడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సహాయాన్ని పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా మొదలు పెట్టడం జరిగిందని, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసాని అందచేస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×