E-Paper
Advertisement

CM Revanth Reddy: కృష్ణా జలాల అంశంపై కేసీఆర్‌ను నిలదీద్దాం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన

CM Revanth Reddy: కృష్ణా జలాల అంశంపై కేసీఆర్‌ను నిలదీద్దాం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన
Advertisement
CM Revanth Reddy On Krishna Basin Projects

CM Revanth Reddy On Krishna Basin Projects: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(KRMB)కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వారి నాయకులను అసెంబ్లీలో నిలదీయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రజా భవన్‌లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పుల గురించి సభ్యులకు వివరించినట్లు సమాచారం.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం KRMBకి అప్పగించినట్లు కారు పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని వాటిని అసెంబ్లీ సమావేశాల్లో తిప్పికొట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

Read More: హస్తం గూటికి మాజీ మేయర్..? సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ..

Advertisement

ఇక ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. KRMB సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించినట్లు బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. అలా ప్రాజెక్టులను అప్పగించినట్లు ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కానీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ కానీ సంతకాలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గురించి చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాయలసీమకు నీటిని తీసుకోవడానికి అప్పటి సీఎం కేసీఆర్ అంగీకరించారని జగన్ అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

సమావేశం తర్వాత ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని వాస్తవాలను బయటపెడ్తామని స్పష్టం చేశారు. తాము అడిగే ఒక్కో ప్రశ్నకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని సూచించారు. కేసీఆర్ నల్లగొండ సభలోపే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని తెలిపారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×