BigTV English

CM Revanth Reddy Meeting: భువనగిరి నేతలకు సీఎం కీలక ఆదేశాలు.. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు!

CM Revanth Reddy Meeting: భువనగిరి నేతలకు సీఎం కీలక ఆదేశాలు.. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు!

CM Revanth Reddy Meeting With Bhuvanagiri Leaders: భువనగిరి పార్లమెంట్ ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన విది విధానాలపై దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కింది స్థాయి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.


భువనగిరి పార్లమెంట్ సిగ్మెంట్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలపై దిశా నిర్దేశం చేశారు. భువనగిరి టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు పోవాలని సీఎం వారికి సూచించారు.

ఈ నెల 21న భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు వెల్లడించారు. భువనగిరిలో నామినేషన్ వేసిన తొలిరోజునే సీఎం భారీ బహిరంగ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.


Also Read: MLC Kavitha CBI investgation: 26కు విచారణ వాయిదా, కండీషన్స్ అప్లై..!

17 నియోజకవర్గాల్లో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. మే మొదటి వారంలో భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించింది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

అయితే రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ ఎన్నికల బరిలో నిలబడనున్నారు. ప్రస్తుతం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ఆ ఎంపీ స్థానం కూడా తమకే దక్కుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×