BigTV English

Shikhar Dhawan: ఆ క్యాచ్ వల్లే.. మ్యాచ్ చేజార్చింది: ధావన్

Shikhar Dhawan: ఆ క్యాచ్ వల్లే.. మ్యాచ్ చేజార్చింది: ధావన్
Shikhar Dhawan In Post Match Presentation After PBKS vs SRH Contest
Shikhar Dhawan In Post Match Presentation After PBKS vs SRH Contest

Shikhar Dhawan In Post Match Presentation After PBKS vs SRH Contest: హైదరాబాద్ సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ముగ్గురు ప్రధాన బ్యాటర్లు త్వరత్వరగా అయిపోయారు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత చూస్తే 13 ఓవర్లలో 100 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు.


కాకపోతే చివర్లో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాచ్ ని మలుపు తిప్పింది. హైదరాబాద్ టెయిల్ ఎండర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆఖరి ఓవర్ నడుస్తోంది. ఇటువైపు జయదేవ్ ఉనద్కత్ స్ట్రయికింగ్ లో ఉన్నాడు. ఒక బాల్ ని సిక్సర్ గా కొట్టాడు. కానీ అదీ కరెక్టుగా బౌండరీ లైనులో ఉన్న హర్షల్ పటేల్ వైపు వచ్చింది. కానీ తను నేలపాలు చేశాడు. క్యాచ్ పట్టుకోకపోయినా పర్వాలేదు. కనీసం సిక్సర్ నైనా ఆపాల్సింది. అదీ చేయకపోవడంతో అది సిక్సర్ గా వెళ్లిపోయింది.

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పుడా క్యాచ్ పట్టినా బాగుండేది లేక సిక్సర్ ఆపినా బాగుండేది. అలా చేసి ఉంటే, పంజాబ్ గెలిచేదని అంతా అంటున్నారు.


ఈ నేపథ్యంలో వారందరితో శిఖర్ ధావన్ కూడా కలిశాడు. ఆ ఒక్క క్యాచ్ వల్లే మ్యాచ్ ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. నిజానికి మ్యాచ్ లో ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి. అంత సీనియర్ అయ్యుండి, తను కూడా ఎన్నో క్యాచ్ లు అలా జారవిడిచి కూడా తోటి ప్లేయర్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మాట్లాడకూడదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం.. పోరాడి ఓడిన పంజాబ్

ధావన్ నీకిది తగదని అంటున్నారు. మ్యాచ్ ఓడిపోయారు. నిజానికి పోరాడి ఓడిపోయారు.అందుకని ఓటమిని నిజాయితీగా ఒప్పుకోవాలని చెబుతున్నారు. మ్యాచ్ లో మంచీ చెడు రెంటికి కెప్టెన్ దే బాధ్యతని చెబుతున్నారు. ఓపెనర్ గా వచ్చి నువ్వు పొడిచిందేమీ లేదు కదా అని సీరియస్ అవుతున్నారు. మొత్తానికి ధావన్ ఓటమికి కుంటిసాకులు వెతకడంపై నెట్టింట మంట పడుతోంది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×