BigTV English

Free Goats: ఫ్రీగా మేకల పంపిణీ.. ఒక్కొక్కరికి 50 అంట.. ఎక్కడో తెలుసా..?

Free Goats: ఫ్రీగా మేకల పంపిణీ.. ఒక్కొక్కరికి 50 అంట.. ఎక్కడో తెలుసా..?

Free Goats: ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు అని ఒక సామెత ఉంటుంది. అలాంటిది ఫ్రీగా మేకలు వస్తే వదులుతారా. ఫ్రీగా పిలిచి మరి మేకలను ఇస్తున్నారు. అదేంటి మేకలను ఫ్రీగా ఇవ్వడమేంటని అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఆసియా అతిపెద్ద ఖండం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులోను అత్యధిక జనాభా కలిగిన ఖండంగాను దీనికి పేరు ఉంది. అందులోను కొన్ని దేశాల్లో మనుషుల జనాభాతో పాటు.. జంతువుల జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుందట.


ఆసియాలోని ఓ ద్వీపంలో మనుషుల జనాభా కేవలం 100 మాత్రమే. కానీ అక్కడి మేకల జనాభా మాత్రం విపరీతంగా ఉంటుందట. ఈ ద్వీపం పేరు అలికుడి. ఇది ఇటాలియన్ లో ఉంటుంది. అయితే అలికుడిలో మేకల జనాభా విపరీతంగా పెరిగిపోతుందట. దీంతో అక్కడ మనుషులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయట. అందువల్ల ఫ్రీగా మేకలను అమ్మకాలకు పెట్టారట.

అలికుడి అనేది అతి తక్కువ జనాభా కలిగిన ఒంటరి ప్రాంతం. ఈ ద్వీపంలో ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుందట. కేవలం గాడిదల రాకపోకలు మాత్రమే ఉంటాయట. ఇక్కడి వెళ్లాలంటే గాడిదల సహాయంతోనే వెళ్లాలట. అయితే ప్రస్తుతం ఈ దీవిని మొత్తం మేకలు ఆక్రమించుకున్నాయి. జనాభా 100గా ఉండే.. మేకల జనాభా మాత్రం 600కు పైగానే ఉందట. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అలికిడిని ఆక్రమించిన మేకలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన వారికి ఉచితంగా మేకల పంపిణీ చేస్తుంది. కేవలం మేకల సంఖ్య పెరుగుతుందనే ఆందోళనతో మాత్రమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.


Also Read: Vietnam Tycoon Truong My Lan: లక్ష కోట్ల మోసం.. వియత్నాం బిలియనీర్‌కు మరణశిక్ష..

ఓ రైతు మేకలను తొలిసారి అలికుడి ద్వీపంలోకి తీసుకువచ్చి కొండచరియలు ఉండే ప్రాంతంలో నివసించాడు. అయితే కాలక్రమేణా.. ఆహారం కోసం వెతుకులాట మొదలుపెట్టగా.. జనారణ్యానికి చేరుకున్నాడు. దీని వల్ల మేకలు గ్రామంలోకి ప్రవేశించి జన నివాసానికి తీవ్ర ఇబ్బందులు పెట్టింది. దీంతో అలికుడి మేయర్ మేకలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అడాప్ట్ ఎ మేక’అనే ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికి దరణాస్తు చేసుకోవాలని కోరారు. ఒక్కొక్కరికి 50 మేకల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మేకలను కావాలనుకునే వ్యక్తులు రూ. 1400 స్టాంపుతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను స్వీకరించిన తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. అయితే ఎంపిక అయిన వారు మేకలను తీసుకెళ్లడానికి 15 రోజుల సమయం పడుతుంది.

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×