CM Revanth Team in Japan: తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా జపాన్‌లో అడుగుపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ దేశ రాజధాని టోక్యోలో అడుగుపెట్టగానే భారత రాయబారి శిబుజార్జ్‌తో సమావేశమయ్యారు. అనంతరం షెడ్యూల్ గురించి వివరించారు. గత రాత్రి టోక్యోలో 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్‌లో ముఖ్యమంత్రి బృందానికి విందు ఏర్పాటు ఇచ్చారు.
ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ కనిమొళి , కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ నెపోలియన్ , పలువురు అధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం డీఎంకె ఎంపీ కనిమొళితో మాట్లాడారు. జపాన్‌లోని ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై చర్చలు జరపనున్నారు.
తొలిరోజు షెడ్యూల్
ఈ టూర్‌లో భాగంగా గురువారం ఉదయం సోనీ గ్రూప్ ప్రతినిధులుతో రేవంత్ టీమ్ సమావేశమైంది. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉందని వివరించారు. ప్రపంచంలోని టాప్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. అలాగే పరిశ్రమల పాలసీ గురించి వివరించారు. ఆ తర్వాత జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సమావేశం కానున్నారు.
సెకండ్ డే
అక్కడి కాలమాన ప్రకారం సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది రేవంత్ టీమ్. అక్కడితో తొలిరోజు షెడ్యూల్ పూర్తికానుంది. ఏప్రిల్ 18 అంటే శుక్రవారం టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు రేవంత్ టీమ్. అనంతరం టోక్యో గవర్నర్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత టయోటా, ఐసిన్, ఎన్టీటీ కంపెనీల సీఈవోలతో చర్చలు జరపనున్నారు.
ALSO READ: కోటి ఇస్తే తండ్రికి తలకొరివి పెడతా, బేకార్ కొడుకు, కూతురు ఏం చేసిందంటే..
థర్డ్ డే షెడ్యూల్
ఆ మధ్యకాలంలో జపాన్ కంపెనీలు విస్తరణ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా వివరించనున్నారు. ఆ తర్వాత సుమిదా రివర్ ఫ్రంట్‌ను సందర్శించనున్నారు. అక్కడితో సెకండ్ డే షెడ్యూల్ ముగియుంది. ఆ తర్వాత 19న మౌంట్ ఫుజి, అరకు రయామా పార్క్‌లను సందర్శించనుంది.
ఫోర్త్ డే ఓసాకా వరల్డ్ ఎక్స్పో
20న కిటాక్యూషు మేయర్‌తో సమావేశమవుతారు సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడి నగరాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారు అనేదాని గురించి తెలుసుకోనున్నారు. అనంతరం ఓసాకాకు బయలుదేరుతారు. 21న ఓసాకా వరల్డ్ ఎక్స్‌పోలో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ తెలంగాణ రైజింగ్ పేరిట పెవిలియన్‌ను ప్రారంభించున్నారు. అక్కడ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
చివరకు ఆ నగరంలో రివర్ ఫ్రంట్‌ను సందర్శించి అక్కడి విషయాలు తెలుసుకోనున్నారు. 22న వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో భేటీ అవుతారు సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడ నుంచి టోక్యోకు చేరుకుంటారు. అనంతరం కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 23న రేవంత్ బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.
సీఎం రేవంత్ బృందానికి జపాన్ లో ఘన స్వాగతం
భారత రాయబారి శిబు జార్జ్ అరేంజ్ చేసిన విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం
పాల్గొన్న DMK ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, అధికారులు
టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్‌లో… pic.twitter.com/8y8Z1rvuR5
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2025