BigTV English

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy on National PoliticsCM Revanth Reddy on National Politics(Political news in telangana): దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గిపోతోందని సీఎం రేవంత్ రెడ్డి వాపోయారు. దీనికి కారణం పార్ట్ టైమ్ రాజకీయనాయకులేనని అభిప్రాయపడ్డారు. ఆదివారం తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్ అనే పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇదొక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని తెలిపారు.


ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలలో తెలుగువారి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీలం సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్ దేశ రాజకీయాలను శాసించారని.. ఇది తెలుగువారందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. వారి తర్వాత సూదిని జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు దేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు తెలుగువారికి సంభందించిన అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే నేతలు కరువయ్యారని తెలిపారు.


Read More: బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఆ ఎంపీ సీటు కోసమేనా?

దేశ రాజకీయాలలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పీవీ దేశ ప్రధానిగా నంద్యాలలో పోటీ చేస్తే ఎన్టీఆర్ పీవీ మీద అభ్యర్ధిని పెట్టలేదన్న సంగతిని గుర్తుచేశారు. తెలుగువారి కోసం రాష్ట్రాలుగా విడిపోయినా కలిసుందాం అని పేర్కొన్నారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×