E-Paper
Advertisement

ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
Advertisement

Basara Temple: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి వివ‌రించారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు రూ.225 కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని అధికారులు తెలియ‌జేశారు.

సీఎం ఆదేశం..

మాస్ట‌ర్‌ప్లాన్‌ను ప‌రిశీలించిన సీఎం ప‌లు మార్పులు సూచించారు. సోమవారం సీఎం బాసరకు వెళ్లనున్నారు. టెంపుల్స్ డెవలప్ మెంట్ కు పలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక సంప్ర‌దాయాలు, శాస్త్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని భ‌క్తుల విశ్వాసాల‌కు పెద్ద‌పీట వేస్తూ బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విశాల‌మైన రోడ్లు నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. ఆల‌య ప్రాంగణం భ‌విష్య‌త్‌లో భారీ వృక్షాల‌తో అల‌రారేలా అవ‌స‌ర‌మైన మొక్క‌లు నాటాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement

Also Read: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!

అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు

ఆల‌యం స‌మీపంలో హెల్త్ సెంట‌ర్ నిర్మించాల‌ని పుష్క‌రాలు, ఇత‌ర ఉత్స‌వాల రోజుల్లో అక్క‌డ త‌గిన సంఖ్య‌లో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భ‌క్తుల‌కు సేవ‌లు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఎంత‌టి ప్ర‌ముఖుల వాహ‌నాలైనా ఆల‌య ప్రాంగ‌ణానికి బ‌య‌టే నిలిచిపోవాల‌ని ఆల‌య ప్రాంగ‌ణంలోకి కేవ‌లం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం సూచించారు. వాహ‌నాల పార్కింగ్ ప్ర‌దేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాల‌న్నారు.

అభివృద్ది ప‌నులు

Advertisement

అభివృద్ధి ప‌నుల స‌మ‌యంలో ఆల‌య ప‌విత్ర‌త‌కు ఎటువంటి భంగం కల‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అభివృద్ది ప‌నుల నాణ్య‌త‌లో రాజీప‌డితే ఏమాత్రం స‌హించేది లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also read: BRS : కేసీఆర్ గుర్తులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయా?

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×