BigTV English

CM Revanth Reddy: పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తాం.. మహిళలను బలోపేతం చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తాం.. మహిళలను బలోపేతం చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పేదవారి ఇంటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణ పేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సీఎం 72,045 గృహాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం సీఎం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని, సంఘాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని, గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదన్నారు. మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా ఎదగాలని అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి మరో పది మందికి సహాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంట్లో ఆడబిడ్డ చేతిలో డబ్బు ఉంటే తమ పిల్లల చదువు కోసం, కుటుంబ గౌరవం కోసం ఖర్చు చేస్తారని సీఎం అన్నారు. అందుకే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సాహిస్తున్నట్లు సీఎం అనగానే, సభకు వచ్చిన మహిళలు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.

సీఎం శంకుస్థాపనల వివరాలివే..
❄ రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
❄ రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.
❄ రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన.
❄ రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ కు శంకుస్థాపన.
❄ రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్ రోడ్ అభివృద్ధి పనులకు, అప్పకపల్లి గుండామల్ రోడ్, మద్దూర్ లింగాల్ చెడ్ రోడ్ లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన
❄ రూ.193 కోట్లతో గుల్బర్గా కొడంగల్, రావులపల్లి మద్దూరు, కోస్గి దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
❄ రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సిఆర్ఆర్ రోడ్లకు శంకుస్థాపన


Also Read: MV MAA Ship: విశాఖలో ఆ షిప్‌కు మోక్షం.. రెస్టారెంట్, బార్‌కు ఏర్పాట్లు.. పెళ్లిల్లూ, ఫంక్షన్లు కూడా..

ప్రారంభోత్సవాల వివరాలు
❄ రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల అకడమిక్ బ్లాకులను ప్రారంభించిన సీఎం
❄ రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాల ప్రారంభించిన ముఖ్యమంత్రి.
❄ రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన సీఎం
❄ రూ.7 కోట్లతో మరికల్ మండల పరిషత్ ఆఫీసు కాంప్లెక్స్ భవనం ప్రారంభించిన సీఎం

మెడికల్ కాలేజీ లో విద్యార్థులతో సీఎం ముఖాముఖి
నారాయణ పేట మెడికల్ కాలేజీ లో విద్యార్థులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్, పారామెడికల్, నర్సింగ్ కాలేజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కేంద్రం తిరస్కరించినా.. మా మంత్రి, అధికారులు తీవ్రంగా ప్రయంత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని సీఎం అన్నారు. కాలేజీలో పూర్తి స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు.

నిజమైన పేదవారికి సంక్షేమం చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్లని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారని, అందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మీ అవసరాలపై అవగాహన ఉన్నవారే మీ ఎమ్మెల్యేగా ఉన్నారని, పేదలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. డాక్టర్ వృత్తి ఒక ఉద్యోగంగా కాకుండ, ఒక బాధ్యతగా గుర్తించాలని సీఎం సూచించారు. మీరంతా గొప్ప డాక్టర్లుగా రాణిస్తే రాష్ట్రానికి మంచి సేవలు అందించగలరని, యాభై ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు ఈ కాలేజీకి పెట్టడం సముచితమని తాను భావిస్తున్నట్లు సీఎం అనగానే విద్యార్థులు చప్పట్లు మారుమ్రోగించారు.

సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనగా, నారాయణ పేట జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయడం ఇదే తొలిసారిగా పేర్కొన్న ప్రజలు, సీఎం ప్రసంగం సాగినంత సేపు జై కాంగ్రెస్, జై రాహుల్, జైజై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలిచ్చారు. సీఎం వెంట మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మేల్యేలు, అధికారులు ఉన్నారు.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×