E-Paper
Advertisement

ప్రియురాలికి పెళ్లి..ఊరంతా పోస్టర్లు వేసిన ప్రియుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్

ప్రియురాలికి పెళ్లి..ఊరంతా పోస్టర్లు వేసిన ప్రియుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్
Advertisement

Sircilla: ప్రియురాలికి మరో యువకుడితో వివాహానికి రెడీ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు ఊరంతా తమ లవ్ పోస్టర్లు అంటించాడు. తన ప్రియురాలికి వారి పేరెంట్స్ ఇష్టం లేని వివాహం బలవంతంగా చేస్తున్నారన్నది సదరు యువకుడు ఆరోపణ. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రియురాలితో దిగిన ఫొటోలతో కూడిన పోస్టర్లు అతికించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్ర ఘటన-రాజన్న సిరిసిల్లా జిల్లాలోని తంగళ్లపల్లి ఈ వింత ఘటనకు వేదికైంది. తాను ప్రేమించిన యువతిని మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు వినూత్నంగా నిరసనకు దిగాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువతిని ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడు ఓ యువకుడు. వారి ప్రేమను అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

Advertisement

ప్రేమ కోసం యువకుడి ప్రయత్నం-వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేశారు.. రేపో మాపో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇంట్లో ఎంత చెప్పినా వారు వినడం లేదు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. ఐనప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ప్రియుడు. కేవలం 16 తులాల బంగారం కోసం తంగళ్లపల్లికి చెందిన ఓ వ్యక్తి.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని వాపోయాడు యువతి ప్రియుడు.

-ప్రియురాలి పెళ్లికి ఊరంతా పోస్టర్లు- చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తన ప్రేమను గెలిపించుకునేందుకు ఊరంతా తెలిసేలా భారీ స్కెచ్ వేశాడు. ఆ అమ్మాయితో ప్రియుడు దిగిన ఫోటో-వివాహం చేసుకోబోయే వ్యక్తి ఫోటోతో పోస్టర్లు డిజైన్ చేశాడు. అర్ధరాత్రి వేళ కాబోయే పెళ్లి కొడుకు ఊరులో పోస్టర్లను అంటించాడు. ఆ పోస్టర్‌లో తంగళ్లపల్లి గ్రామ ప్రజలకు తెలియ జేయునది ఏమనగా అంటూ మొదలుపెట్టాడు.

Advertisement

పైన చెప్పిన మేటరంతా రాసుకొచ్చాడు. వీధుల్లోని గోడలు ఈ పోస్టర్లతో నిండిపోయాయి. ఎటు చూసినా అమ్మాయి-కాబోయే భర్త-ప్రియుడు పోస్టర్లు దర్శనమీయడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తంగళ్లపల్లి ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పోస్టర్లు, ఫెక్సీలు సోషల్ మీడియాలో వీవైరల్ అవుతోంది.

ALSO READ: వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా.. ఈసారి లోగో వంతు, డిజైన్ చేయండి-లక్ష గెలుచుకోండి

ఆ ప్రాంతంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలో పోస్టర్లు అంటించిన వ్యక్తి దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ తరహా నిరసన స్థానికంగా చర్చ మొదలైంది. మరో విషయం ఏంటంటే.. పోస్టర్‌లో వరుడి పేరు, ఫోన్ నంబర్లతో సహా వివరాలను ముద్రించాడు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.

Related News

ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య అంటే నమ్మాలా?.. బండి సంజయ్ చురకలు

నిరాహార దీక్ష.. అస్వస్థతకు గురైన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు, నేతల్లో కలకలం

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

Big Stories

Advertisement
×