BigTV English

CM Revanth Reddy : జిల్లా కలెక్టర్లతో నేడు సీఎం రేవంత్‌ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం..

CM Revanth Reddy : జిల్లా కలెక్టర్లతో నేడు సీఎం రేవంత్‌ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం..

CM Revanth Reddy : పాలనలో తన మార్క్‌ను చూపిస్తూ ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా.. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వాటిపై దృష్టిసారించారు. ఎవరైనా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత..తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దుకుని నెమ్మదిగా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతారు. కానీ రేవంత్ మాత్రం అందరిలా కాకుండా పరిపాలలో ఓ కొత్త ఒరవడిశ్రీకారం చుట్టారు. వస్తూరాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టారు.


అందుకు ప్రగతిభవన్ ను ప్రజా భవన్ గా మార్చి.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణిని నిర్వహించయమే అందుకు నిదర్శనం. పరిపానలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు..100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించేందుకు ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్‌. అదనపు కలెక్టర్లను కూడా సమావేశంలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సచివాలయం ఏడో అంతస్తులోని డోమ్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్లతో జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనన్నారు.

అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన రేవంత్‌.. ఇదే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణ యించారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఈ సదస్సులో జిల్లాల యంత్రాంగంతో సమావేశమవుతున్నారు రేవంత్‌రెడ్డి. ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమంతో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా.. అదే తరహా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఇవాళ్టి సదస్సు ద్వారా సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేయనున్నారు.


జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయిల్లో పకడ్బందీగా ప్రజావాణిని నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు సీఎం. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు.. పాలనను ప్రజలకు ఎలా చేరువ చేయాలనేదానిపై కూడా వివరించానున్నారు రేవంత్‌. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు వరకు పెంపుపై కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నారు.

క్షేత్రస్థాయికి పాలనాయంత్రాంగాన్ని తీసుకెళ్లి.. నిరుపేదలు, అట్టడుగువర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించింది రేవంత్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామసభలు సెలవు దినాలు మినహా జనవరి 6 వరకు ఎనిమిది రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రతి 4 నెలలకోసారి గ్రామసభలు నిర్వహించి..క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోనుంది ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో కూడా సమస్యల స్వీకరణకు ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించింది రేవంత్‌ సర్కార్‌. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామసభలు కొనసాగనున్నాయి.

హైదరాబాద్‌లోని ప్రజా భవ న్‌లో వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ఇళ్లు, భూ సమస్యలు, ఉద్యోగాలు, ధరణి, పెన్షన్లకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రజాపాలన పేరిట గ్రామ సభలు ఏర్పాటు చేస్తోంది. ప్రజలకు పాలనను చేరువగా తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామ, వార్డు స్థాయిల్లో ఈ సభలు ఏర్పాటు చేయడంతో పాటు.. గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల్లో అధికారుల బృందాలు పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించేందుకు ప్రత్యేక నంబర్‌ ఇవ్వడంతో పాటు దరఖాస్తులను కంప్యూటరీకరించనున్నారు.

జిల్లా కలెక్టర్లతో నిర్వహించే ఈ సమావేశంలో.. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పంపిణీ చేశారు.. వాటి పరిస్థితి ఎలా ఉంది.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్లు.. వాటి స్థితిగతులపై కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మొత్తానికి పరిపాలనలో తదైన మార్క్‌ను కనబరుస్తూ..పాలనను కొత్తపుంతలు తొక్కిస్తూ ప్రజలకు చేరువవడమే

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×