EPAPER

TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

– సంస్థను ఆర్థికంగా బలోపేతం చేద్దాం
– రుణాల రీకన్‌స్ట్రక్షన్‌తో వడ్డీ తగ్గించుకోండి
– డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులు
– మహాలక్ష్మి పథకం సక్సెస్‌‌ను నిలుపుకోవాలి
– ఆర్టీసీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి


Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోళ్లు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ఇందుకు ప్రతిపాదిక చేసుకోవాల‌ని సూచించారు. మంగళవారం సచివాలయంలో టీజీ ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు.

మహాలక్ష్మీ పథకంపై ఆరా..
తెలంగాణ వ్యాప్తంగా మ‌హాల‌క్ష్మి ప‌థకం కింద ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి, ఆ పథకం వివిధ వర్గాల మహిళలకు ఎలా ఉపయోగపడుతోంది? వంటి అంశాలను సీఎం ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా ఉంద‌ని, ఇప్పటి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్రయాణం చేశార‌ని అధికారులు వివరించారు. ఉచిత ప్రయాయం వల్ల ఇప్పటి వరకు మహిళలకు రూ.2,840.71 కోట్లు ఆదా అయిందని ర‌వాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. ఆర్టీసీలో 7,292 బ‌స్సులలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌న్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంద‌ని, అందుకు సంబంధించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను సీఎంకు అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్రజంటేష‌న్ లో చూపారు.


పెరిగిన ఆక్యుపెన్సీ
మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ఆక్యుపెన్సీ రేటు పెర‌గ‌డంతో పాటు సర్కారు చెల్లిస్తున్న రీయింబ‌ర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వ‌స్తోంద‌ని అధికారులు సీఎంకు తెలిపారు. మారుతున్న అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు పెంచాలని, కాలేజీలకు బస్సుల్లో వెళ్లే విద్యార్థుల సమయానికి తగినట్లు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

Also Read: Revanth Reddy: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

సంస్థ ఆర్థిక పరిస్థితిపై చర్చ
అనంత‌రం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌విష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు క‌లిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివ‌రించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని.. వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్షన్‌పై అధ్యయ‌నం చేయాల‌ని సీం ఆదేశించారు. వచ్చిన లాభాలతో క్రమంగా రుణ‌భారం త‌గ్గించాల‌ని సూచించారు. ఈ స‌మీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం, ర‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి వికాస్ రాజ్‌, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్, తదిత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related News

IAS officers: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

Big Stories

×