BigTV English

Loan Waiver: మాఫీ కాలే.. ఇదుగో రుజువు.. ఆ ఊరిలో ఒక్కరికైనా మాఫీ కాలేదు: కేటీఆర్

Loan Waiver: మాఫీ కాలే.. ఇదుగో రుజువు.. ఆ ఊరిలో ఒక్కరికైనా మాఫీ కాలేదు: కేటీఆర్

– రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కారు దగా
– పెంటవెల్లిలో 499 మందిలో ఒక్కరికీ మాఫీ కాలే
– నాలుగో వంతు మందికీ న్యాయం జరగలే
– ఇకనైనా ప్రభుత్వం నిజం ఒప్పుకోవాలి
– బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్


KTR: స్వతంత్ర భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అతి పెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే నాగర్ కర్నూల్ జిల్లా పెంటవెల్లి గ్రామమని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

ఒక్కరికీ మాఫీ కాలే..
పెంటవెల్లిలో 499మంది రైతులు ఉండగా.. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాకపోవటం దారుణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్ ట్విటర్‌లో నిప్పులు చెరిగారు. రుణమాఫీ పూర్తిచేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రివి బూటకపు మాటలని చెప్పడానికి ఈ గ్రామమే సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. అంత మంది రైతులు ఉన్న పెంటవెల్లిలో ఒక్కరంటే ఒక్కరికీ మాఫీ కాకపోవడం పచ్చి మోసం కాక మరేమిటంటూ ప్రశ్నలు సంధించారు. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 దాకా డెడ్ లైన్లు పెట్టుకుంటూ వచ్చిన సీఎం ఈ గ్రామ రైతులకు ఎందుకు మాఫీ కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Also Read: TGSRTC: ఆర్టీసీని నిలబెడతాం.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

ఇంతమోసమా?
తెలంగాణలోని రైతాంగంలో నాలుగో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా వందశాతం అయిపోయినట్టు సీఎం ఫోజులు కొడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి రైతులకు రుణమాఫీ చేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు పెంటవెల్లి గ్రామ రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన తెలుపుతున్న వార్తాపత్రిక క్లిప్‌ను ట్వీట్‌కు కేటీఆర్ జతచేశారు.

Related News

Weather News: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, జాగ్రత్తగా ఉండడి..!

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్

Khairatabad Ganesh: విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపతి.. ఈసారి ఎన్ని అడుగులంటే..

Wife beats husband: భర్తను చితక్కొట్టిన భార్య.. ఏడుస్తూ పోలీసులకు ఆశ్రయించిన భర్త

Big Stories

×