Apple Store in Hyderabad: అమెరికా కంపెనీలు ఒకప్పుడు ఉత్తరాదిలో మాల్స్, స్టోర్స్ ప్రారంభించేవారు. మారుతున్న పరిస్థితుల రీత్యా దక్షిణాది వైపు ఫోకస్ చేశారు. ఆయా కంపెనీల చూపు హైదరాబాద్ నగరంపై పడింది. తాజాగా యాపిల్ కంపెనీలో భాగ్యనగరంలో స్టోర్ ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
భారతదేశంలో యాపిల్ కంపెనీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. యాపిల్ ఉత్పత్తులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురానుంది. కీలక నగరాల్లో రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఆ కంపెనీ, భారత మార్కెట్ పైపు ఫోకస్ చేసింది. టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ హైదరాబాద్ సిటీలో కొత్త రిటైల్ స్టోర్ ఓపెన్ చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. యాపిల్ కూకట్‌పల్లి పేరుతో రాబోతోంది.
డిసెంబర్ 10 సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. కూకట్‌పల్లిలోని లేక్ షోర్-వై జంక్షన్ మాల్‌లో యాపిల్ స్టోర్ ఏర్పాటు కానుంది. యాపిల్ కూకట్‌పల్లిని సందర్శించే వినియోగదారులు ఇకపై ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ డ్యూయో, ప్రోలెడ్ ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే, టచ్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్ 12, ఆపిల్ వాచ్ అల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5, హోమ్‌వ్యూ, హోమ్‌పాడ్ మినీ 2 వంటి ఉత్పత్తులను చూడగలరు.
యాపిల్ కూకట్‌పల్లి చేరికతో దేశంలో యాపిల్ రిటైల్ నెట్‌వర్క్‌లో ముంబై, ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, పూణె సరసన హైదరాబాద్ నగరం కూడా చేరింది. యాపిల్ ఎప్పటి మాదిరిగా స్టోర్ ప్రారంభోత్సవం కోసం విలక్షణమైన బ్రాండింగ్‌ను ఎంపిక చేసుకుంది. కూకట్‌పల్లి స్టోర్ బారికేడ్‌పై ముత్యాల స్ఫూర్తితో రెడీ చేసిన యాపిల్ లోగోను రూపొందించింది. ముత్యాల నగరంగా హైదరాబాద్‌కు ఉన్న గుర్తింపు నుండి ఈ డిజైన్ స్ఫూర్తి పొందింది. ఈ నగరం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని యాపిల్ చెబుతోంది.
ALSO READ: స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!