E-Paper
Advertisement

CM Revanth Reddy: దేశంలో తొలి ముఖ్యమంత్రి.. హార్వర్డ్‌ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌, దావోస్ నుంచి

CM Revanth Reddy: దేశంలో తొలి ముఖ్యమంత్రి.. హార్వర్డ్‌ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌, దావోస్ నుంచి
Advertisement

CM Revanth Reddy: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌గా అవతారం ఎత్తనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ యూనివర్సిటీలో లీడర్‌ షిప్‌పై కోర్స్‌ చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనత సాధించబోతున్నారు ఆయన.

హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌‌రెడ్డి

Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన ఘనత సాధించనున్నారు. దేశంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కోర్స్ సర్టిఫికెట్ అందుకోనున్నారు. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థగా పేరుపొందింది హార్వర్డ్ యూనివర్సిటీ.

అందులోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ‘లీడర్‌షిప్-21 సెంచరీ’ అనే విభాగంలో ప్రత్యేక కోర్సుకు హాజరుకానున్నారు. ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం (అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)’ అనే అంశంపై ఈ కోర్సు జరగనుంది. జనవరి 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో క్లాసులకు హాజరవుతారు ముఖ్యమంత్రి.

Advertisement

దావోస్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ పయనం

అంతేకాదు దేశ చరిత్రలో ఐవీ లీగ్ విద్యా కార్యక్రమంలో పాల్గొననున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చరిత్ర కెక్కనున్నారు. జనవరి 19 నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు సీఎం.

ఈ కోర్సు కోసం ఐదు ఖండాల నుంచి 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. అందులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒకరు. రేవంత్ రెడ్డి తరగతులకు హాజరై వారిచ్చిన అసైన్‌మెంట్స్, హోమ్ ‌వర్క్‌లు పూర్తి చేయడం, గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహించనున్నారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

ALSO READ:  హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య..  రంగంలోకి యువ ఐపీఎస్‌లు

రేవంత్‌రెడ్డి ప్రీ- అడ్మిషన్ ఇంటర్వ్యూకు హాజరై, నాయకుడిగా తాను ఎదుర్కొన్నఅతిపెద్ద సవాలుపై ఒక పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి తీసుకున్న కేస్ స్టడీలను విశ్లేషించనుంది హార్వర్డ్‌ యూనివర్సిటీ. పరిష్కారాలు రూపొందించి థియరీని సమర్పిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సీఎం రేవంత్‌ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ అందుకుంటారు.

 

Related News

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

Big Stories

Advertisement
×