E-Paper
Advertisement

CM Revanth Reddy: కేసీఆర్ ను అల్లుడే మోసం చేసిండా? ఇద్దరు తోడు దొంగలా?: సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy: కేసీఆర్ ను  అల్లుడే మోసం చేసిండా? ఇద్దరు తోడు దొంగలా?:  సీఎం రేవంత్ ఫైర్
Advertisement

CM Revanth Reddy: కృష్ణా నదీ జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చింది స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆరేనని, ఆయన సవాల్‌ను స్వీకరించి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాము వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశామని సీఎం స్పష్టం చేశారు.

ఎంతో రాజకీయ అనుభవం, ఇరిగేషన్ రంగంపై పట్టు ఉన్న కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తారని తాము ఆశించామని, కానీ ఆయన గత రెండేళ్లుగా చట్టసభకు రాకపోవడం ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి విచారకరమని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ప్రజల్లో అనవసరమైన గందరగోళం నెలకొంటుందని, అసెంబ్లీ వేదికగా రికార్డుల సాక్షిగా చర్చిస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

Advertisement

తాను పేదరికాన్ని, నీటి కరవును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తినని, అందుకే ఈ ప్రాంత రైతుల కష్టాలు తనకు బాగా తెలుసని అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను, ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకే ఈ ప్రత్యేక చర్చ చేపట్టామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తోడు దొంగల్లా దోచుకున్నారు..

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఆ భారాన్ని ప్రజలపై మోపిన కేసీఆర్.. నేడు సభకు రాకుండా బయట కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఈ విషయాలను గాంధీ భవన్‌లోనో, మీడియా సమావేశాల్లోనో ప్రస్తావించకపోవడానికి కారణం.. అధికారిక ఆధారాలతో సభలోనే కేసీఆర్‌తో ముఖాముఖి తేల్చుకోవాలన్న ఉద్దేశమేనని స్పష్టం చేశారు.

Advertisement

ఈ దోపిడీ కేసీఆర్‌కు తెలిసే జరిగిందా? లేక అల్లుడిని (హరీష్ రావును) నమ్మితే.. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న సామెతలా ఆయన ఏమైనా తప్పుదోవ పట్టించారా? లేదా మామఅల్లుళ్లు ఇద్దరూ తోడు దొంగల్లా మారి వేల కోట్లు కొల్లగొట్టారా? అన్నది నిగ్గుతేల్చడానికే తాను ఈ వివరాలన్నీ సభ ముందుకు తెచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంచనాలు పెంచి ప్రాజెక్టులు కట్టినా.. కనీసం నీళ్లయినా వచ్చి ఉంటే ఓ ఐదేళ్లకో, పదేళ్లకో జనం ఆ ఖర్చును మర్చిపోయేవాళ్లని, కానీ ఆ పని కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల చర్యలు దుర్మార్గపు పరాకాష్ట అని, దాన్ని వర్ణించడానికి తనకు మాటలు కూడా రావడం లేదని సీఎం ధ్వజమెత్తారు.

దోపిడీకి ఒక ‘ప్యాటర్న్’ ఉంటుంది..

కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టును జూరాల వద్ద (70 TMCలు) డిజైన్ చేస్తే, కేసీఆర్ దానిని శ్రీశైలంకు (90 TMCలు) మార్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన జూరాల డిజైన్ ఉంటే ఏపీ అభ్యంతరం చెప్పేది కాదని, కానీ సోర్స్ (Source) మార్చడం వల్ల ఇది ‘కొత్త ప్రాజెక్ట్’ అని ఏపీ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయడానికి ఆస్కారం ఇచ్చారని అన్నారు. కేవలం కాంట్రాక్టర్లకు బిల్లులు పెంచడానికి, కమీషన్ల కోసమే డిజైన్ మార్చి, లిఫ్టులు, పంపుల సంఖ్యను పెంచారని ఆరోపించారు.

నేరగాళ్లు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో నేరాలు చేసినట్లే.. ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోపిడీ చేయడానికి కూడా ఒక ‘ప్యాటర్న్’ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు పాత నేరగాళ్లను విచారించి ఆ ప్యాటర్న్‌ను ఎలా గుర్తిస్తారో, కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడీ విధానం కూడా అలాగే ఉందని పరోక్షంగా ఎద్దేవా చేశారు.

Read Also: BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×