Ajith’s son Aadvik : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) సినిమాల కంటే ఎక్కువగా కార్ రేసింగ్ పై ఆసక్తిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దుబాయ్ లో జరిగిన కార్ రేస్ లో తన టీంతో కలిసి పాల్గొన్న అజిత్ విన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అజిత్ కుమార్ కొడుకు (Aadvik) కూడా రన్నింగ్ రేస్ లో పాల్గొని, 3 గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం.
తండ్రికి తగ్గ తనయుడు
అజిత్ కుమార్ (Ajith) – శాలిని దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు ఆద్విక్ (Aadvik), కూతురు పేరు అనౌష్క. అజిత్ కొడుకు అద్విక్ కు క్రీడలు అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఆటలను బాగా ఆడతాడు ఆద్విక్. ప్రస్తుతం స్కూల్లో చదువుతున్న ఆద్విక్ తాజాగా రన్నింగ్ రేస్ లో పాల్గొని ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. అంతేకాకుండా మూడు రన్నింగ్ రేసుల్లో పాల్గొని, 3 గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. ఆ 3 రన్నింగ్ రేసుల్లోనూ ఆద్విక్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. 100 మీటర్ల రన్నింగ్ రేస్ లో వేగంగా పరిగెత్తి, ఫస్ట్ ప్లేస్ ను కొట్టేసిన ఆద్విక్ వీడియోను శాలిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి. అజిత్ కొడుకు ఆద్విక్ హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెడుతున్నాడని, తండ్రికి తగ్గ తనయుడని కొనియాడుతున్నారు నెటిజెన్లు. ఇక ఈ వీడియోపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
కార్ రేసింగ్ లో విన్ అయిన అజిత్…
ఇటీవల అజిత్ కుమార్ (Ajith) దుబాయ్ 24హెచ్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్నాడు. 15 సంవత్సరాల తర్వాత రేసింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అజిత్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రేసింగ్ ను మేనేజ్ చేయనున్నట్టు వెల్లడించారు. అజిత్ కుమార్ రేసింగ్ టీమ్, ఈ రేసింగ్ ఈవెంట్ లో విన్ అయ్యి, మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అనేక అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ లలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న అజిత్ కుమార్ సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. నెక్స్ట్ రేసింగ్ ఈవెంట్ పోర్చుగల్ లో ఉంది.
అజిత్ కుమార్ (Ajith) సినిమాల విషయానికొస్తే… దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ నటించిన కొత్త సినిమా ‘విదాముయార్చి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో అజిత్ చేసిన మరో మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ రేసింగ్ సీజన్ లో తాను ఎలాంటి సినిమాలకు సైన్ చేయనని చెప్పాడు. రేసింగ్ సీజన్ పూర్తయ్యాకనే ఆయన నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.