CM Revanth Reddy : ఏప్రిల్ 22, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాగ్రత్తగా గమనిస్తే.. ఇద్దరు రాజకీయ నేతలు మిగతా వారందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు మన తెలుగు నాయకులే కావడం గర్వకారణం. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మరొకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టెర్రర్ అటాక్ బాధితులకు నివాళిగా పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలను నిర్వహించారు జనసేనాని. బాధిత తెలుగు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పార్టీ తరఫున 50 లక్షల పరిహారం అందించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయితే ఏకంగా టార్చ్ బేరర్‌గా నిలిచారు.
రేవంత్.. ది లీడర్..
సిసలైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలోనే పని తీరుతో మెప్పిస్తాడు. సీఎం రేవంత్‌రెడ్డి తీరే అందుకు నిదర్శనం అంటున్నారు. ఇటీవలే ఆపరేషన్ సిందూర్‌కు సపోర్ట్‌గా భారీ స్థాయిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు, సైన్యం, పోలీసులతో కలిసి ర్యాలీ చేపట్టారు. సైన్యానికి తమ పూర్తి మద్దతు ఉందంటూ వారిలో నైతిక స్థైర్యాన్ని నింపారు. తాజాగా, మరో ఆసక్తికర నిర్ణయం ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు నెల జీతం
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా తన నెల జీతాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేశారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలన్నారు. పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ శాసన సభ్యులు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం విరాళం ఇవ్వాలని సూచించారు.
As an Indian first, I have decided to make a very modest contribution of one month’s salary to the #NationalDefenceFund for the efforts
of our country’s brave Armed Forces to wipe out terrorism, and safeguard our borders & people.I have requested all my colleagues and party…
— Revanth Reddy (@revanth_anumula) May 9, 2025
సీఎం ఆన్ డ్యూటీ..
అపరేషన్ సిందూర్ మొదలైనప్పటి నుంచీ సీఎం యాక్టివ్ అయ్యారు. ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీస్ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేసి.. ఇండియా, పాక్ యుద్ధంపై జరిగే ఫేక్ న్యూస్ ప్రచారానికి చెక్ పెట్టాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ, హోం సెక్రటరీ, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర కీలక రంగాల ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా చర్యలను సమీక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు పూర్తి సన్నద్దతతో ఉండేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇలా వరుస రివ్యూలు, పకడ్బందీ చర్యలతో ముఖ్యమంత్రిగా సమర్థత చాటుకుంటున్నారు రేవంత్‌రెడ్డి. లేటెస్ట్‌గా నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు నెల జీతం విరాళంగా ఇచ్చే ఏర్పాటు చేస్తూ.. దేశానికి, ఆర్మీకి, ఆపరేషన్ సిందూర్‌కు బలమైన మద్దతుదారుగా నిలుస్తు్న్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.