BigTV English
Advertisement

Summer Headache: వేసవిలో విపరీతమైన తల నొప్పి.. డాక్టర్లు చెప్పే కారణం అదే..

Summer Headache: వేసవిలో విపరీతమైన తల నొప్పి.. డాక్టర్లు చెప్పే కారణం అదే..

Summer Headache: వేసవి వేడికి చాలామంది తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. వాతావరణం నుంచి రోజువారీ అలవాట్ల వరకు వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ వేసవి తలనొప్పికి చాలానే కారణాలు చెప్పారు. ఆ కారణాలను తెలుసుకుంటే తలనొప్పిని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.


నీళ్లు ఎక్కువ తాగాలి:
వేసవి తలనొప్పికి పెద్ద కారణం అంటే నీటి కొరత అని చెప్పుకోవాలి. ఎక్కువ వేడి వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతుంది. తగినన్ని నీరు తాగకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది. శరీరంలో నీరు తక్కువైతే మెదడు కుంచించుకుపోయి నొప్పి సున్నితమైన నరాలు ఉత్తేజమవుతాయనవి నిపుణులు చెబుతున్నారు. దీనిని నివారించడానికి రోజుకు 8-10 గ్లాసుల నీరు తీసుకోవాలని చెబుతున్నారు. బయట ఉంటే లేదా వేడి ఎక్కువ అయితే ఆ నీరు మరింత ఎక్కువగా తీసుకోవాలి.

వేడి, తేమ:
వేడి, తేమవల్ల తలనొప్పి ముఖ్యంగా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 2023 లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం వేడిలో మార్పులు, తేమ ఎక్కువ ఉండడంవల్ల మెదడులో రక్త నాళాలు ప్రభావితం అయ్యి మైగ్రేన్ కు దారితీయొచ్చు. వాతావరణానికి సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు ఏసీ ఉన్నచోట ఉండి మధ్యాహ్నం వేడికి దూరంగా ఉండడం మంచిదని వైద్యుల సలహా.


సూర్యకాంతి, కాంతి ప్రతిబింబం:
వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది. నీళ్లు, ఇసుక వంటి వాటి నుంచి కాంతి ప్రతిబింబించడంవల్ల కళ్ళకు ఒత్తిడి పెరిగి టెన్షన్, తలనొప్పి వంటివి వస్తాయి. ఎక్కువ కాంతితో కళ్ళలో ఒత్తిడి పెరిగి తల, ముఖంలోని కండరాలు బిగుసుకుపోయి నొప్పిని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు. పోలరైజ్డ్ సన్ గ్లాసెస్, పెద్ద హ్యాట్ వాడడం వల్ల కాంతి ప్రభావం తగ్గుతుందని అన్నారు.

నిద్ర, రొటీన్ గందరగోళం:
వేసవిలో రోజువారీ రొటీన్ ఆలస్యంగా నిద్రపోవడం, ట్రిప్స్, అనియత భోజనం లాంటివి నిద్రను గందరగోళం కలిగిస్తాయి. నిద్రలేమి తలనొప్పికి కారణమవుతుంది. స్థిరమైన నిద్ర తలనొప్పిని తగ్గిస్తుంది. ట్రిప్స్ లోనూ రెగ్యులర్ నిద్ర షెడ్యూలు, చల్లని చీకటి గది వంటివి అలవాటు చేసుకోవడంవల్ల ఈ సమస్య తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

అలర్జీలు సైనస్ ఇబ్బందులు:
వేసవిలో పుప్పొడి బూజు లాంటివి పెరిగి అలర్జీలను కలిగిస్తాయి. ఈ అలర్జీలు సైనస్ వాపును కలిగించి సైనస్ తలనొప్పిని మరింత పెంచుతాయి. యాంటీ హిస్టామిన్ ట్యాబ్లేట్లు, నేసల్ స్ప్రేలు, పుప్పొడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కిటికీలు మూసేయడం వంటివి సహాయపడతాయి.

ఆహారం:
వేసవిలో బార్బిక్యూలు, పార్టీల్లో తలనొప్పి తెచ్చే ఆహారాలు, డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఆల్కహాల్, కెఫీన్, MSG, నైట్రేట్స్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇందులో ఉంటాయి. రెడ్ వైన్, చక్కెర ఉన్న కాక్‌టెయిల్స్ మైగ్రేన్ ను కలిగిస్తాయి. తలనొప్పిని కలిగించే ఆహారాలు తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణుల సలహా.

Related News

Bitter Gourd Juice: ఉదయం పూట కాకరకాయ జ్యూస్ తాగితే.. ఈ రోగాలన్నీ పరార్ !

Chicken Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది తింటే బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Big Stories

×