CM Revanth Reddy: దేశ చరిత్రలో లిఖించే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో బుధవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కెసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఏడాది పాలనలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సీఎం మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కి సంతాపం తెలపడం కోసం తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సంధర్భంగా మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటైందని సీఎం గుర్తు చేశారు.
పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరును నామకరణం చేసినట్లు సీఎం చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన, చేయబోయే పథకాల గురించి కూడ పీఏసీ సమావేశంలో ప్రస్తావించారు. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు రూ. 4000 కోట్ల నిధులను ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందన్నారు. జనవరి 26న రైతు భరోసా పథాకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. అంతేకాకుండ రైతు కూలీలకు కూడ అండగా నిలిచేందుకు యేడాదికి రూ. 12 వేలు అందిస్తామన్నారు. రేషన్ కార్డు లేని ప్రజలకు కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వబోతున్నట్లు సీఎం మరోమారు పునరుద్ఘాటించారు.
Also Read: BJP on KCR: పెద్దమనిషి ఎక్కడ? కేసీఆర్ పై బీజేపీ సంచలన ట్వీట్
యేడాది పాలనలో 55143 ఉద్యోగాలు ఇచ్చి, నిరుద్యోగ సమస్యకు కాస్త ఉపశమనం కల్పించినట్లు సీఎం అన్నారు. అంతేకాకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం తెలిపారు. యేడాది లో రూ. 54 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడ విజయవంతంగా అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
గాంధీ భవన్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ నేతలు pic.twitter.com/HUtb0OAzdC
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025