BigTV English

CM Revanth Reddy : గురువారం ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అజెండా ఇదేనా..?

CM Revanth Reddy : గురువారం ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అజెండా ఇదేనా..?

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం హస్తినలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీకి సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.


సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరగనుంది. జనవరి 7న లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. వారికి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ సమాచారం పంపింది. తెలంగాణలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్ల ఈ భేటీకి హాజరవుతారు. వారితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ చర్చించనున్నారు.

తెలంగాణలోని మెజార్టీ లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉన్నారు. వారితో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చించున్నారు. ఐసీసీ కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ అంశంపైనా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీతో చర్చిస్తారని తెలుస్తోంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×