BigTV English

CM Revanth Reddy: కమాండ్ కంట్రోల్ ‌సెంటర్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: కమాండ్ కంట్రోల్ ‌సెంటర్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తతో కలిసి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు సీఎం. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారాయన.


ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం ఇంతకుముందే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలసిందే. ఇందుకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు.

వర్షాకాలం నేపథ్యలో వరద తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలను మొత్తం 141 గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపటినట్లు పేర్కొన్నారు. వాటర్ హార్వెస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్తుందన్నారు. రోడ్లపై నీరు నిల్వకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


Also Read: అంతా ఆయన చెప్పినట్టే చేశాం.. మాకేం సంబంధం లేదు: రిటైర్డ్ ఇంజనీర్లు

ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇక ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్ మెంట్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Related News

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Big Stories

×