Telangana Govt: దావోస్ లో తెలంగాణ సత్తా చాటారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత భారీగా పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. రైజింగ్ తెలంగాణ బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకోగా, గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించిన పెట్టుబడులు రావడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. అది కూడ ఇప్పటివరకు రూ. 1,64,050 కోట్ల పెట్టుబడులు వెల్లువలా రాగా, కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ. 1,64,050 కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి.
హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది.
దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్ లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ. 1,64,050 కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
Also Read: CM Revanth Reddy: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి సాధన.. అమెజాన్‌తో కీలక ఒప్పందం
ఒప్పందాలు ఇవే..
⦿ యూనిలీవర్ సంస్థ కామారెడ్డిలో పామాయిల్ కేంద్రం ఏర్పాటు ⦿ స్క్వేర్ రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ 500 కోట్లు పెట్టుబడి ⦿ 11 వేల కోట్ల పెట్టుబడుల తో మెగా సంస్థ 2160 మెగా వాట్లతో పంపు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి కేంద్రం ద్వారా 1250 ఉద్యోగాలు ⦿ 3000 కోట్లతో బ్యాటరీ ఎనర్జీ కేంద్రం 4000 ఉద్యోగాలు ⦿ 1000 కోట్లతో పర్యావరణ రంగం లో పెట్టుబడి ⦿ కంట్రోల్ ఎస్ సంస్థ AI ఆధారిత డాట క్లస్టర్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు ⦿ ఎస్ సంస్థ పదివేల కోట్ల పెట్టుబడి 3600 మందికి ఉపాధి ⦿ HCL కొత్త టెక్ క్యాంపస్ ⦿ హైదరాబాద్‌లో విప్రో విస్తరణ ⦿ గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ⦿ 5000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ⦿ రూ.800 కోట్లతో అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జేఎస్ డబ్ల్యూ ⦿ రూ.45500 కోట్లతో రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు మూడు చోట్ల నెలకొల్పనున్న సన్ పెట్రో కెమికల్స్ పెట్టుబడులకు ఒప్పందం.. 7000 ఉద్యోగాలు ⦿ గోపనపల్లి లో విప్రో కొత్త క్యాంపస్ , ప్రత్యక్షంగా పరోక్షంగా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు ⦿ పోచారంలో ఇన్ఫోసిస్ సేవలు విస్తరణ ⦿ 17వేల మందికి ఉపాధి అవకాశాలు ⦿ మొదటి దశగా 750 కోట్లు పెట్టుబడి
⦿ అమెజాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో 60 వేల కోట్ల పెట్టుబడులు