BigTV English

Ysrcp Self Goal: వైసీపీ సెల్ఫ్ గోల్.. ఆ వీడియో పెట్టి అడ్డంగా బుక్కైపోయారుగా!

Ysrcp Self Goal: వైసీపీ సెల్ఫ్ గోల్.. ఆ వీడియో పెట్టి అడ్డంగా బుక్కైపోయారుగా!

“రంపచోడవరంలో బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం” అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ వీడియో పోస్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను కాపాడేందుకు పెద్దేరు వాగును ట్యూబ్ సాయంతో గిరిజనులు దాటుతున్న వీడియో అది. ఆ వీడియో అబద్ధమేమీ కాదు, గ్రాఫిక్స్ అంతకంటే కాదు, ఏఐని వాడి తయారు చేసిన ఫేక్ వీడియో కూడా కాదు. కానీ ఆ వీడియో పోస్ట్ చేసిన వైసీపీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అంటూ ఆ పోస్ట్ పెట్టిన వైసీపీ నెటిజన్లతో తిట్లు కాచుకోవాల్సి వచ్చింది. అవి మామూలు తిట్లు కాదు, బండ బూతులు.


అసలు ఆ ఐదేళ్లు మీరు ఏం—?
ఆ ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా, అప్పుడు—
2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న జగన్ ఏం—?
ఇలా సాగాయి ఆ బూతులు. ఇటీవల కాలంలో వైసీపీ ఈ స్థాయిలో తిట్టించుకుంది ఈ వీడియో వల్లే కావడం విశేషం. అంతగా తిట్టడానికి వారేం తప్పు వీడియో పెట్టలేదు కానీ, తమవైపు తప్పు ఉంచుకుని కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించారు. అదే సమయంలో నాలుగు వేళ్లు తమవైపు చూస్తున్నాయనే విషయాన్ని వారు మరచిపోయారు. ఆ మరచిపోయున విషయాన్ని నెటిజన్లు బూతులు తిట్టి మరీ గుర్తు చేశారు.

మీ చేతగానితనమే..
“పోస్ట్ వేసేప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో తమ్ముడు. కూటమి గత 15 ఏళ్ళనుండి పాలించడం లేదు. గత ప్రభుత్వం మీదే. మీరు బయటకి తీసుకొస్తున్న ప్రతీ సమస్య మీ చేతకాకాని తనమే. మీ చేతకాని తనాన్ని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మీ చేతకాని తనానికి సొల్యుషన్ కూటమి ప్రభుత్వమే.” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

సీన్ రివర్స్..
వాస్తవానికి పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేయడానికి వైసీపీ ఈ ట్వీట్ వేసింది. గిరిజనుల్ని ఉద్ధరిస్తానన్న ఆయన, ఏం చేస్తున్నారని, రోడ్లు ఎందుకు వేయలేదని నిలదీసింది వైసీపీ. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంలో చాలావరకు కొత్త రోడ్లు వచ్చాయి. గత 15 ఏళ్లుగా రోడ్డు లేని చోట కూడా ఇప్పుడు కొత్త రోడ్డు వచ్చిందని గ్రామస్తులు సంతోషంగా తమ ఊరి రోడ్డు వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న సందర్భం. ఇలాంటి టైమ్ లో వైసీపీ ఈ వీడియో పెట్టడం సంచలనంగా మారింది. ఏడాదిలో ఎంత చేయాలో అంతా చేసింది, ఇంకా చేస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం. ఈ టైమ్ లో కేవలం విమర్శల కోసమే వైసీపీ ఈ వీడియో పోస్ట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ చేతగాని తనాన్ని కూడా వారే బయటపెట్టుకున్నట్టయింది. వైసీపీ విమర్శలు చేయొచ్చు కానీ ఇది మరీ టూ ఎర్లీ. ఇంత త్వరగా విమర్శలు మొదలు పెడితే, అసలు మీ ప్రభుత్వం ఏం చేసింది అంటూ కచ్చితంగా ప్రశ్నలు వినపడతాయి. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఇదే ఘటన నాలుగేళ్ల తర్వాత జరిగితే, అప్పుడు వైసీపీ విమర్శలు చేస్తే వాటికి ఫలితం ఉండేది. కానీ ఇప్పుడు ఫలితం లేదు సరికదా, వైసీపీనే రివర్స్ లో బలి అవుతోంది.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×