BigTV English

CM Revanth Reddy: పనితీరు మెరుగుపరుచుకోండి.. మంత్రులకు, ఎమ్మేల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన

CM Revanth Reddy: పనితీరు మెరుగుపరుచుకోండి.. మంత్రులకు, ఎమ్మేల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ, పార్టీపరమైన అంశాలపై కీలక సూచనలు జారీ చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇకపై తాను ఎక్కువ సమయం పార్టీ నాయకులకు కేటాయించనున్నట్లు, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలివచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం సందడిగా మారింది. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్ట్ లు తన వద్ద ఉన్నాయని, అలాగే తన రిపోర్టు కూడా తాను తెప్పించుకున్నట్లు సీఎం అన్నారు.

ఎవరి ప్రోగ్రెస్ రిపోర్టు వారికి అప్పగించడం జరుగుతుందని, ప్రజలకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. ఏడాది పాలనలో తెలిసి తప్పు చేయలేదని, తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నామంటూ సీఎం అన్నారు. ఏడాది పాలనలో ఎన్నికల కోడ్ రావడంతో పూర్తిస్థాయి పాలన ఆరు నెలలు సాగినట్లుగా భావించాలని, కేవలం ఆరు నెలల్లో ప్రజా మద్దతును తమ ప్రభుత్వం సాధించిందన్నారు. ఏడాది పాలన అనుభవాలు, వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయని, ప్రజా ప్రభుత్వంగా మన ప్రభుత్వం గుర్తింపు పొందేలా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సీఎం సూచించారు.


ఈ దశలో అంగన్వాడీ, డీలర్ల నియామకంలో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఓ మంత్రి కోరగా, ఆ విషయాన్ని సీఎం తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకొని, పారదర్శకంగా నియామకాలు చేపట్టకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టేందుకు సాహసించలేదని, తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సాగించిందన్నారు.

ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా కీలకమంటూ ప్రజా ప్రతినిధులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి విషయం గురించి తన వద్ద సమాచారం ఉందని, పార్టీ బలోపేతానికి కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Also Read: Ponnam Prabhakar: గురుకులాల్లో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించను.. మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్లు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని కూడా సీఎం అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు గుర్తించి ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు తమ పనితీరును మరింతగా మెరుగుపరుచుకుని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మద్దతు కూడబెట్టుకోవాలని సీఎం తెలిపారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×