BigTV English

CM Revanth In Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్ బిజీ, వాణిజ్య మంత్రితో భేటీ

CM Revanth In Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్ బిజీ, వాణిజ్య మంత్రితో భేటీ

CM Revanth In Singapore: తెలంగాణకు పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది సీఎం రేవంత్ టీమ్. రెండోరోజు అక్కడి పర్యవరణ, వాణిజ్య శాఖ మంత్రులతో సమావేశమైంది. పలు రంగాల్లో భాగస్వామ్యం కోసం ఇరుపక్షాలు విస్తృత చర్చలు జరిపాయి.


తొలిరోజు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్-ఐటీఈ క్యాంపన్‌ను సందర్శించింది సీఎం రేవంత్ టీమ్. అందుబాటులో ఉన్న వనరులను టెక్నాలజీ సాయంతో ఎలా అందిపుచ్చుకుంటున్నారో గమనించింది. ఆ తర్వాత అక్కడి భారతీయులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి.

ఇందులో భాగంగా రెండోరోజు శనివారం ఆదేశ పర్యావరణ శాఖ, వాణిజ్యశాఖ మంత్రి గ్రేస్ ఫూ హై యెన్‌‌తో సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాకారం చేయడానికి తమవంతు సహకారం అందించాలని కోరింది. తెలంగాణ ఆహ్వానాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.


నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, రివర్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణ, తెలంగాణ సుస్థిరత ప్రణాళికలపై ఆసక్తి చూపింది. కొన్ని ప్రాజెక్టుల్లో ఇటు తెలంగాణ.. అటు సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పని చేయనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నాయి.

ALSO READ:  ఫార్ములా -ఈ రేస్ కేసు.. డొంక కదులుతోంది, ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు

మరోవైపు ఐటీ- పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అధికారులతో సహా ప్రతినిధి బృందం తెలంగాణలో పట్టణ ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం మరియు సుస్థిరత వంటి అనేక రంగాలలో పెట్టుబడి అవకాశాలను వివరించారు.

సెమీ కండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ)తో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు.

ఈ సమావేశంలో వివిధ సంస్థలు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సహకారం ప్రోత్సాహకాలను తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానానికి ఎఎస్ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సెమీ కండక్టర్ల పరిశ్రమల పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి పరిశీలన చేస్తామని తెలిపారు.

తొలిరోజు సింగపూర్ విదేశాంగ మంత్రితోపాటు ఐటీఈ గురించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్‌లో ఫోర్ల్ సిటీని ప్రభుత్వం నిర్మిస్తోంది. అక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ‌కి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.

నైపుణ్యాల అభివృద్ధి శిక్షణలో పరస్పర సహకారంతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రతిపాదించారు. అందుకు ఐటీఈ సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ-స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×