BigTV English
Advertisement

Formula scandal: ఫార్ములా -ఈ రేస్ కేసు.. డొంక కదులుతోంది, ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు

Formula scandal: ఫార్ములా -ఈ రేస్ కేసు.. డొంక కదులుతోంది, ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు

Formula scandal: ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈనెలాఖరులోగా విచారణ పూర్తి అవుతుందా? ఇటు ఏసీబీకి.. అటు ఈడీకి చిక్కిన, లభించిన ఆధారాలేంటి? ఈ కేసులో ఏసీబీ ముందు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు హాజరవుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఫార్మాలా ఈ రేసు కుంభకోణంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసు ప్రారంభంలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. వీరిని విచారిస్తే ఇక్కడితే కేసు ఆగిపోయినట్టేనని చాలామంది భావించారు. ఇప్పుడు తెరపైకి ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ పేరు వచ్చింది.

ఆ కంపెనీ.. ఫార్ములా ఈ- రేసుకు స్పాన్సర్ షిప్‌గా వ్యవహరించింది. ఇప్పుడు నిజాలు నిగ్గు తేల్చేపనిలో పడ్డారు అధికారులు. విచారణకు హాజరుకావాలని ఏస్ నెక్ట్స్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ- కార్ రేస్ 9వ సీజన్‌కు స్పాన్సర్ గా వ్యవహరించింది. అయితే 10వ సీజన్‌కు తప్పుకుంది ఈ కంపెనీ.


10వ సీజన్ ఏస్ నెక్ట్స్ తప్పుకోవడంతో దాని స్థానంలో ఎంటరైంది హెచ్ఎండీఏ. ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్. ఆయనతో-మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎలెక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో. అయితే ఏస్ నెక్ట్స్ జెన్ మాతృ సంస్థ గ్రీన్ కో.

ALSO READ: హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. అసలేం జరిగిందంటే?

విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు చేయడం, ఆపై కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు నోరు విప్పితే ఈ కేసు క్లయిమాక్స్‌కు రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కంపెనీ నిజాలు చెబుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేస్తోంది ఆ కంపెనీ. ఇలాంటి సమయంలో కేసు వ్యవహారం ఆ కంపెనీ మెడకు చుట్టుకుంటే ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశముంది. మరి ఫార్ములా కుంభకోణం ఇక్కడితే ఆగుతుందా? ఏసీబీ తర్వాత ఈడీ కూడా ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు అంతర్గత సమాచారం.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×