Maheesh Theekshana: ఇటీవలి కాలంలో ఎంతోమంది క్రికెటర్లు పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడుతున్నారన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుండి క్రికెటర్లకు సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాగే క్రికెటర్లు ప్రేమలో పడడం కొత్తేంకాదు. చాలామంది క్రికెటర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరో క్రికెటర్ కూడా తన ప్రేయసిని వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.
Also Read: Rinku Singh: రింకూ సింగ్ పెళ్లిని అడ్డుకుంటున్న ప్రియా సరోజ్ తండ్రి ?
అతనెవరో కాదు శ్రీలంక స్పిన్ బౌలర్ మహేష్ తీక్షన. ఇతడు తన ప్రేయసి అర్తికా యోనాలిని వివాహం చేసుకున్నాడు. కొలంబో వేదికగా జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ దేశ క్రికెటర్లు అంతా హాజరయ్యారు. సన్నిహితులు, బంధుమిత్రులు, ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ఈ జంటకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మహేష్ తీక్షన శ్రీలంక తరపున 2021 సెప్టెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం మహేష్ తీక్షన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
ఇతడి బౌలింగ్ యాక్షన్ శ్రీలంక మాజీ మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ ని పోలి ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 – 24 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మహేష్ 27 మ్యాచ్ లలో 25 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కి ఆడబోతున్నాడు ఈ యంగ్ ప్లేయర్. 23 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు కేవలం రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మహేష్ తీక్షన 59 పరుగులు చేశాడు.
అలాగే 37.60 ఐదు వికెట్లు పడగొట్టాడు. 50 వన్డేల్లో 311 పరుగులు చేసి.. 26.23 సగటుతో తో 72 వికెట్లు తీశాడు. 60 టి-20 ల్లో 26.56 సగటుతో 58 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 27 మ్యాచ్ లు ఆడిన తీక్షన.. 7.00 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Rohit Sharma: శనివారం రోహిత్ సంచలన ప్రెస్ మీట్..ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా రెడీ ?
శ్రీలంక తరపున మూడు ఫార్మాట్ లలో కలిపి 135 వికెట్లు తీశాడు తీక్షణ. 2022 జూలై 8 న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక 2021 సెప్టెంబర్ 7న సౌత్ ఆఫ్రికా తో జరిగిన వన్డే మ్యాచ్ తో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 2021 సెప్టెంబర్ 10న సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి-20 మ్యాచ్ తో టి-20 ల్లోకి అరంగేట్రం చేశాడు.
Sri Lankan cricketer Maheesh Theekshana entered a new chapter of his life as he got married today.
Wishing the newlyweds a lifetime of happiness pic.twitter.com/MfgC9ZR26t
— Cricwire (@CricWireLK) January 17, 2025