BigTV English

Teeth Whitening: పళ్లు పసుపు రంగులోకి మారాయా ? ఈ టిప్స్ మీ కోసమే !

Teeth Whitening: పళ్లు పసుపు రంగులోకి మారాయా ? ఈ టిప్స్ మీ కోసమే !

Teeth Whitening: ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో పళ్లు కూడా  ముఖ్య పాత్ర పోషిస్తాయి. పళ్లు తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ చెడు జీవన శైలితో పాటు, ఎక్కువగా కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం, ధూమపానం, మద్యం తీసుకోవడం వంటివి పళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతాయి.


రంగు మారిన పళ్ల కారణంగా బహిరంగంగా నవ్వడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడే వారికి కొన్ని రకాల హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి పళ్లు తెల్లగా మెరిసేలా చేయడంలో ఎలాంటి హోం రెమెడీస్ ప్రభావ వంతంగా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బేకింగ్ సోడా,నిమ్మకాయ:


కావాల్సినవి:
బేకింగ్ సోడా – 1 టీ స్పూన్
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

ఎలా వాడాలి ?

దీనిని ఉపయోగించడానికి పైన తెలిపిన మోతాదులో బేకింగ్ సోడా తీసుకుని అందులో నిమ్మరసం వేసి కలపండి. ఇప్పుడు దీన్ని టూత్ బ్రష్ మీద అప్లై చేసి దంతాలపై సున్నితంగా రుద్దండి. రెండు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. దీనిని మీరు రోజూ ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల పళ్లపై ఉండే పసుపు రంగు పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాకుండా పళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

2. పసుపు, కొబ్బరి నూనె మిశ్రమం:
కావాల్సినవి:
పసుపు- 1 టీ స్పూన్
కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్

ఎలా వాడాలి ?
దీనిని ఉపయోగించడానికి, ముందుగా పైన తెలిపిన మోతాదులో పసుపును 1 టీ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను బ్రష్ సహాయంతో పళ్లపై రాయండి. రెండు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇది పళ్లపై ఉన్న పసుపు రంగును పూర్తిగా తొలగిస్తుంది. అంతే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

3. కొబ్బరి నూనె:
ఆయిల్ పుల్లింగ్ సహాయంతో మీరు మీ దంతాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు . దీని కోసం 1-2 చెంచాల కొబ్బరి నూనెను నోటిలో ఉంచుకోండి. తరువాత 10-15 నిమిషాలు నోటిలో కదిలించండి. దీని తరువాత నోటిని శుభ్రం చేసుకుని ఆపై బ్రష్ చేయండి. ఇది మీ నోటిని కూడా శుభ్ర పరుస్తుంది. పసుపు రంగును పూర్తిగా తొలగిస్తుంది.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :
దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. పళ్లపై దీనిని ఉపయోగించడానికి ముందుగా 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కాస్త నీటిలో కలపండి. తర్వాత దీంతో రోజుకు ఒకసారి శుభ్రం చేసుకోండి. ఇది దంతాల నుండి మరకలను కూడా తొలగిస్తుంది.అంతే కాకుండా క్షణాల్లోనే మెరిసేలా చేస్తుంది.

Also Read: ముఖం నల్లగా మారుతోందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసి పోతారు

5. అరటి తొక్క వాడకం:
దీని వాడకం చాలా సులభం. అరటి తొక్క లోపలి భాగాన్ని మీ పళ్లపై రుద్దండి. 2-3 నిమిషాలు రుద్దిన తర్వాత, నీటితో కడిగేయండి. ఇది మీ దంతాలను అంతర్గతంగా శుభ్ర పరుస్తుంది. అంతే కాకుండా పల్ల పై ఉన్న మరకలను పూర్తిగా తొలగిస్తుంది. రంగు మారిన పళ్లతో ఇబ్బంది పడుతున్న వారు అరటి తొక్కలను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×