BigTV English

CM Revanthreddy: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanthreddy: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanthreddy: హైదరాబాద్ మహానగరంలో ఇకపై ఆక్రమణలు జరగడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రతి చెరువు నాలాల ఆక్రమణలకు సంబంధించిన వివరాలు సేకరించాలని నివేదిక ఇవ్వాలన్నారు. ఇకపై ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలన్నారు.


హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలన్నారు. అభివృద్ధి విషయంలో పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదన్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలన్నారు.


ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని అధికారులకు నిర్ధేశం చేశారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాల్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలన్నారు.

ALSO READ: డిపోలోకి వచ్చి మరీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరకు ఎలా దొరికాడంటే..?

ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌పై రెడీ చేసి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు.

ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టడంతోపాటు మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ ‌మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు‌, హైడ్రాపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×