CM Revanthreddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై దృష్టి సారించింది. ఆసుపత్రులు నిర్మాణాలు, ఉద్యోగాలు నియమకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. సదుపాయాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఆసుపత్రుల విషయంలో మరింత శ్రద్ధ పెట్టింది కూడా.
ఒకప్పుడు గాలికి వదిలేసిన వైద్య శాఖ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఏ చిన్న సమస్య వచ్చినా సామాన్యులతోపాటు ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి నెలకొంది. అందుకు ఉదాహరణ మహిళా జడ్జి జ్యోతిర్మయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచారు ఆమె.
ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు జూనియర్ సివిల్ జడ్డి జ్యోతిర్మయి సోమవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. స్వయానా జడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడంపై ప్రశంసలు జల్లు కురుసున్నాయి.
రెండేళ్ల కింద అంటే 2023లో వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి కూతురికి జన్మనిచ్చారు ఆమె. రెండో కాన్పులో ఇప్పుడు ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. రెండూ సాధారణ ప్రసవాలే కావడం గమనార్హం.
ALSO READ: శంషాబాద్ ఎయిర్ పోర్టులో తప్పిన ప్రమాదం.. విమానంలో 190 మంది ప్రయాణికులు
సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. సంపన్న దేశం అంటే ప్రైవేట్ ఆరోగ్య సేవలు ప్రజలు భరించేవిగా ఉండాలన్నారు. అప్పుడే అన్నివర్గాలు ఆరోగ్య సేవలను నమ్ముతారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నుండి 17 నెలల్లో వేములవాడ అలాంటివి అనేకం వెలుగులోకి వచ్చాయి.
సివిల్ జడ్జి జ్యోతిర్మయి గారు తన ప్రసవానికి ప్రభుత్వ సౌకర్యాన్ని ఎంచుకోవడం ద్వారా ఒక ఉదాహరణగా నిలిచారు. ఆమె రెండవ బిడ్డకు కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఈ పాప తెలంగాణకు ఆశాకిరణం, ఆమె ఎదుగుదలలో రైజింగ్ తెలంగాణ ఆపలేని ప్రయాణంగా మనం చూస్తామని రాసుకొచ్చారు.
అంతకుముందు జడ్జి జ్యోతిర్మయి తన ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు. ఈ సందర్బంగా జడ్జి జ్యోతిర్మయిని తోటి జడ్జిలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.