E-Paper
Advertisement

Telangana Assembly: విపక్షాలను చెడుగుడు ఆడేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. 20 నిమిషాలపాటు మాస్ ర్యాగింగ్

Telangana Assembly: విపక్షాలను చెడుగుడు ఆడేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. 20 నిమిషాలపాటు మాస్ ర్యాగింగ్
Advertisement

Telangana Assembly: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు చూసి విపక్షాలు బెంబేలెత్తున్నాయా? సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు చూసి తట్టుకోలేక పోతున్నాయా? అసెంబ్లీలో రెండోరోజు ముఖ్యమంత్రి స్పీచ్ చూసి షాకయ్యాయా? వివిధ పార్టీల నేతలు మీడియా ముందు చేసిన కామెంట్లకు వరస పెట్టి కౌంటర్ ఎటాక్ ఇచ్చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మూసీ పునరుద్దరణ అంశం.. ఏకధాటిగా 40 నిమిషాల పాటు సీఎం స్పీచ్

Advertisement

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం మూసీ సుందరీకరణపై అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఏకధాటిగా 40 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో 20 నిమిషాలపాటు మాస్ ర్యాగింగ్ చేశారు. ఒకటీ రెండు కాదు ఏకంగా మూడు భాషల్లో స్పీచ్ ఇచ్చేసరికి నోరు వెళ్లబెట్టడం విపక్షాల వంతైంది.

Advertisement

సీఎం రేవంత్ దూకుడు చూసి సభలో పలువురు సభ్యులు రన్నింగ్ కామెంట్స్ చేశారు. వారినీ కూడా ముఖ్యమంత్రి వదల్లేదు. ఒక్క చూపుతో సభ సైలెంట్ అయిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే మీడియాతో మాట్లాడే కంటే సభలో ముఖ్యమంత్రి ఫైర్ స్పీచ్ చూసి షాకయ్యారు. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు ఎంఐఎం లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం సమాధానాలతో అంతా సైలెంటయ్యారు. 

విపక్షాలను చెడుగుడు ఆడేసిన సీఎం రేవంత్‌రెడ్డి

నార్మల్‌గా సబ్జెక్ట్ లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడరని చాలామంది నేతలు చెబుతుంటారు. శుక్రవారం సభలో సీఎం మాటలు చూసి ఏ ఒక్కరూ నోరెత్తలేకపోయారు. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని పలువురు సభ్యులకు హితవు పలికారు. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో విషం అత్యంత ప్రమాదకరమైనది వర్ణించారు.

నిజాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ ఆయన సూటిగా నిలదీశారు. నిజాలు తెలియకుండా చూడాలనుకుంటున్నారా? అంటూ వారిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకంటూ విపక్ష సభ్యులపై రుసరుసలాడారు.

తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారానంటూ కొందరు సభ్యుల చేసిన ఆరోపణలపై అసలు రహస్యం బయటపెట్టారు సీఎం రేవంత్. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ అని, దాన్ని ప్రమోట్ చేసేందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ALSO READ:  మున్సిపల్ ఎన్నికలకు రేవంత్ సర్కార్ సిద్ధం, ఈ నెలలో ఎన్నికల షెడ్యూల్ ?

రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల పరిశ్రమలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సైబరాబాద్ అభివృద్ధి విషయంలో ఆనాడు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. తొలుత హైటెక్ సిటీకి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ఫౌండేషన్ వేశారన్నారు. ఆ తర్వాత ఆగిపోయిందన్నారు.

చంద్రబాబు-వాజ్‌పేయి ఆధ్వర్యంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. ఆనాడూ ఇలాంటి ఆరోపణలు చేశారని, ప్రభుత్వం ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు.  ఇన్నాళ్లు తమకే అన్నీ తెలుసంటూ కొందరు మాట్లాడిన మాటలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు సీఎం. 

బీఆర్ఎస్‌, ఎంఐఎంపై మాత్రమేకాదు, బీజేపీని సైతం ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. నది పరివాహక ప్రాంతాల అభివృద్ధిని బీజేపీ ఎన్నికల అజెండాగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. మిగతా రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించలేదని, నదులు కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారంటూ దుమ్మెత్తిపోశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌ సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పమన్నారు. డీపీఆర్ సిద్దమయ్యాక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత సలహాలు తీసుకుంటామని గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.

 

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×