BigTV English

Zoetis company Expand: సీఎం రేవంత్‌తో జొయిటిస్ కంపెనీ ప్రతినిధులు, విస్తరణపై చర్చలు..

Zoetis company Expand: సీఎం రేవంత్‌తో జొయిటిస్ కంపెనీ ప్రతినిధులు, విస్తరణపై చర్చలు..

Zoetis company Expand: అమెరికా టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉంది. ఒకవైపు వ్యాపార వేత్తలతో పెట్టుబడులు పెట్టాలని చర్చిస్తోంది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించు కునే పనిలోపడ్డాయి. అలాంటి వాటిలో ప్రపంచంలో జంతు ఆరోగ్య సంస్థగా పేరుపొందిన జొయిటిస్ ఒకటి. ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ బృందంతో దాదాపు నాలుగున్నర గంటలపైగానే చర్చించారు.


హైదరాబాద్‌లో జోయిటిస్‌కి కంపెనీ ఉంది. దీన్ని విస్తరించే పనిలో పడింది. ఈ కంపెనీ దాదాపు ఏడు దశాబ్దాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్థారణ, చికిత్స సంబంధించి అంశాలపై పని చేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యాజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఔషదాలు, వ్యాక్సిన్‌లు నిర్ధారణలో కొత్త సాంకేతిక టెక్నాలజీ వంటి అంశాలపై వంద దేశాలకు పైగానే సేవలు అందిస్తోంది.

హైదరాబాద్‌లో జోయిటిస్ కంపెనీకి సెంటర్ ఉంది. దాన్ని విస్తరించే పనిలోపడింది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది ప్లాన్. దీనివల్ల వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రతినిధులు రేవంత్ టీమ్‌కు వివరించారు. ఆ కంపెనీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆలోచనలకు ఈ పెట్టుబడులు మరింత సహాయ పడతాయన్నారు.


ALSO READ: తెలంగాణలో గ్రీన్‌ డేటా సెంటర్.. రూ. 3,320 కోట్ల పెట్టుబడులు

జంతువుల ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు ఆ కంపెనీ చీఫ్ ఆఫీసర్. తెలంగాణలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటామన్నారు. మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడంతో జోయిటిస్ కాకుండా హైదరాబాద్‌లో మరికొన్ని అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలోపడ్డాయి.

CM Revanthreddy talks to Zoetis company
CM Revanthreddy talks to Zoetis company

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×