OTT Movies: ప్రతివారం సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కో వారం, ఒక్కో సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది.. వారం మారిందంటే థియేటర్ లతోపాటు అటు ఓటీటీల్లో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ వచ్చేస్తుంటాయి.. జూలై రెండో వారం కొత్త సినిమాలు సందడి చేశాయి. అలాగే మూడో వారం కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి.. గత నెలలో రిలీజ్ అయిన కుబేర, కన్నప్ప సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ‘జూనియర్’ కాస్త ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఇది.. శ్రీలీల హీరోయిన్ కావడంతో కాస్త హైప్ ఏర్పడింది. ఇక వచ్చేవారం థియేటర్లలోకి రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..
ఇక ఓటీటీ విషయానికొస్తే.. జులై మూడవ వరం ప్రేక్షకులను అలరించడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. ఏకంగా 15 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఐదు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. కుబేర, భైరవం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తోపాటు ద భూత్ని అనే హిందీ చిత్రం, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 తో పాటుగా మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..
అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 14
ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 (జపనీస్ ఎనిమీ సిరీస్) – జూలై 14
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18
హాట్‍స్టార్..
కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ సిరీస్) – జూలై 15
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 18
స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
లయన్స్ గేట్ ప్లే..
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) – జూలై 18
ఆపిల్ ప్లస్ టీవీ..
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 18
జీ5..
భైరవం (తెలుగు సినిమా) – జూలై 18
ద భూత్ని (హిందీ మూవీ) – జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) – జూలై 18
అమెజాన్ ప్రైమ్..
కుబేర (తెలుగు మూవీ) – జూలై 18
ఎమ్ఎక్స్ ప్లేయర్..
గుటర్ గూ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూలై 17
మొత్తానికి ఈ వారం 15 సినిమాలు అయితే ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. వెబ్ సిరీస్ లు, సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. మూవీ లవర్స్ కు పండగే.. ఈ సినిమాలు మాత్రమే కాదు కొత్త సినిమాలు కూడా సడన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని, మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి.