BigTV English

Hydra Commissioner ranganath: సూపర్ స్కెచ్ వేసిన హైడ్రా.. ఇక వారికి ముప్పుతిప్పలే..

Hydra Commissioner ranganath: సూపర్ స్కెచ్ వేసిన హైడ్రా.. ఇక వారికి ముప్పుతిప్పలే..

⦿ హైడ్రా గ్రీవెన్స్ డే
⦿ ప్రతి సోమవారం నిర్వహణ
⦿ కొత్త సంవత్సరం 2025 నుంచి ఆరంభం
⦿ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణ
⦿ విశేష స్పందన నేపథ్యంలో కీలక నిర్ణయం
⦿ అందుబాటులో ఉండనున్న సీనియర్ అధికారులు
⦿ హైడ్రా చీఫ్ రంగనాథ్ వెల్లడి
⦿ ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరిగే ఛాన్స్


హైదరాబాద్: Hydra Commissioner ranganath: హైడ్రా.. ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ నగరంలోని ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో తమవంతు ఎప్పుడొస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇన్నాళ్లూ ఫిర్యాదుల స్వీకరణ విషయంలో పరిమితంగా వ్యవహరించిన హైడ్రా త్వరలోనే నేరుగా సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ దిశగా ఈ మేరకు అడుగులు వేస్తోంది.

నూతన సంవత్సరం 2025 ప్రారంభం నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించాలని నిర్ణయించింది. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జనాల నుంచి ఫిర్యాదులు తీసుకోనుంది. ఇందుకోసం గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసి సీనియర్ అధికారులు అందుబాటులో ఉండేలా చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు.


Also Read: Case on Kaushik Reddy: సీఐపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిందుల ఎఫెక్ట్.. కేసు నమోదు చేసిన పోలీసులు

పెరగనున్న ఫిర్యాదుల సంఖ్య!
సామాన్య జనాలే నేరుగా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని హైడ్రా కల్పించడంతో ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వెలుగులోకి వచ్చే ఆక్రమణలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంతకాలం జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు గుర్తించిన ఆక్రమణలు, అలాగే వాట్సప్, ఫోన్‌కాల్స్ ద్వారా హైడ్రా ఫిర్యాదులు స్వీకరించింది. పలుచోట్ల స్థానిక ప్రజలు కలిసికట్టుగా కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో నేరుగా సామాన్యుల నుంచే ఫిర్యాదులు స్వీకరించాలని హైడా నిర్ణయించింది.

కాగా ఇప్పటివరకు వాట్సప్, ఫోన్ కాల్స్ ద్వారా హైడ్రాకు వేలాది ఫిర్యాదులు అందాయి. వాటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆక్రమణలు తొలగిస్తోంది. స్థలాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగిస్తోంది. ప్రజల ఫిర్యాదులు కూడా ప్రారంభమైతే 2025లో హైడ్రా దూకుడు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది

Related News

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Heavy Rains: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

TG High Court: తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

CM Revanth: ముఖ్యమంత్రి ఇంటి గోడను కూల్చేసిన అధికారులు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!

×