Allu Arjun: ప్రపంచంలో ఏ కొడుకుకు అయినా తన తండ్రే హీరో. చిన్నప్పటి నుంచి తండ్రిని చూసే పెరుగుతూ ఉంటాడు. కానీ, పెరిగేకొద్దీ తండ్రి కోపాన్ని చూసి.. వారి మనసులో ఉన్న ప్రేమను బయటకు చెప్పలేకపోతారు. ఎప్పుడైనా తండ్రి ప్రేమను బయటపెట్టాల్సిన సమయం వస్తే మాత్రం.. వారు చూపించే ప్రేమ ముందు అన్ని దిగదుడుపే. కొడుకు ప్రేమను చూసి తండ్రి కూడా ఎంతో మురిసిపోతాడు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. తన వారసుడు.. అల్లు అయాన్.. తండ్రి మీద ఉన్న ప్రేమను అక్షరాల్లా మార్చి.. బన్నీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. పుష్ప 2 రిలీజ్ అంటే బన్నీ ఒక బిగ్ డే. ఆ స్పెషల్ డేను అయాన్.. మరింత స్పెషల్ గా మారాడు. బన్నీ- స్నేహల పెద్ద కొడుకు అల్లు అయాన్. తన ముద్దు ముద్దు మాటలతో, అల్లరి పనులతో సోషల్ మీడియాలో ఎప్పుడుట్రెండ్ అవుతూనే ఉంటాడు.
Shraddha Srinath: వాట్ ఏ బ్యూటీ.. అందంతో కనువిందు చేస్తున్న శ్రద్ధ..
మొన్నటికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అయాన్.. పుష్ప 2 గురించి ఎంతో చక్కగా చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య షోలో అయితే.. తన తండ్రికి.. చెల్లి అర్హ కన్నా.. తనంటే ఎక్కువ ప్రేమ అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు వచ్చి రానీ ఇంగ్లీష్ భాషలో పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడు.. ఒక కొడుకుగా తను తన తండ్రిని తలుచుకొని ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడో రాసుకొచ్చాడు. ఆ లెటర్ ను బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
లెటర్ లో అయాన్ ఏం రాసాడంటే.. ” డియర్ నాన్న.. నేను మీ గురించి మరియు మీ విజయం గురించి ఎంత గర్వపడుతున్నానో వ్యక్తీకరించడానికి ఈ లెటర్ రాస్తున్నాను. నేను నీ కష్టాన్ని, ప్యాషన్ ను, డెడికేషన్ ను ఒకేసారి చూసాను. ఈరోజు మీకు చాలా స్పెషల్ రోజు.. ప్రపంచంలోనే గొప్ప నటుడి చిత్రం విడుదలైన ప్రత్యేక రోజు. ఈ రోజున మీ భావోద్వేగాల మిశ్రమ బ్యాగ్‌ని నేను అర్థం చేసుకున్నాను. పుష్ప 2 కేవలం ఒక సినిమానే కాదు.. నటన అంటే మీకు ఎంత డెడికేషనో, ప్రేమనో.. మీ అద్భుతమైన ప్రయాణాన్ని చూపించే అద్దం. నేను మీకు మరియు మీ టీమ్‌కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పే అవకాశాన్నీ వదులుకోవాలనుకోవడం లేదు.
IDENTITY Teaser: మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్న త్రిష.. టీజర్ అదిరింది
ఫలితం ఏమైనప్పటికీ.. మీరు ఎప్పటికీ నాకు హీరోనే. మీకు ప్రపంచంలోనే లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను ఇప్పటికీ మరియు ఎప్పటికీ శ్రేయోభిలాషిగా గొప్ప అభిమానిగానే ఉంటాను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు వైల్డ్ ఫైరు” అని రాస్తూ చివరన.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్న మీ కొడుకు బుజ్జి బాబు అని ముగించాడు.
ఇక ఈ లెటర్ ను చూసి బన్నీ మురిసిపోయాడు. “నా కొడుకు అయాన్ ప్రేమ నా గుండెను తాకింది. ఇప్పటివరకు నేను సాధించిన అతిపెద్ద విజయాలలో ఇది ఒకటి. అలాంటి ప్రేమ లభించడం అదృష్టం.. చిన్న పిల్లాడు రాసిన లెటర్ లో ఏమైనా తప్పులు ఉంటే పట్టించుకోకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఇంతకుమించిన విజయం ఏ తండ్రికి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Touched by my son ayaan’s letter 🖤 pic.twitter.com/dLDKOvb6jn
— Allu Arjun (@alluarjun) December 4, 2024