E-Paper
Advertisement

CM KCR: సీఎం కేసీఆర్‌పై పోలీసులకు కంప్లైంట్.. ఎమ్మెల్యే నారాజ్..

CM KCR: సీఎం కేసీఆర్‌పై పోలీసులకు కంప్లైంట్.. ఎమ్మెల్యే నారాజ్..
Advertisement
cm kcr

KCR latest news telugu(TS news updates): సీఎం కేసీఆర్. ఫుల్ ముచ్చట్లు చెబుతారు. అది చేస్తా.. ఇది చేస్తా.. అలా చేస్తా.. ఇలా చేస్తా.. అంతిస్తా.. ఇంతిస్తా.. అబ్బో నోటికి ఏదొస్తే అంత చెప్పేస్తారు. ఏ జిల్లాకెళ్లినా హామీల వర్షం కురిపిస్తారు. మాటల్లో నిధుల వరద పారిస్తారు. జనంతో చప్పట్లు కొట్టించుకుంటారు. కట్ చేస్తే.. ఇక అంతే సంగతి. మళ్లీ ముఖం చూపించారు. పైసా కూడా విదిలించరు. ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించేస్తారు. ఇలా తొమ్మిదేళ్లుగా సాగుతోంది తతంగం. చూసీ చూసీ ఓ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఇట్లైతే ఎట్లా? అంటూ ఏకంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హామీలు నెరవేర్చలేదని, ఇస్తానన్న నిధులు ఇవ్వలేదని.. వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య.

అవును, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య ఏకంగా సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టడం కలకలం రేపుతోంది. ఫస్ట్ టైమ్ భద్రాచలం వచ్చినప్పుడు రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పారని.. అది ఇప్పటి వరకూ ఇవ్వలేదని అన్నారు. కొన్ని నెలల క్రితం.. వరదల సమయంలో వచ్చి పరిహారంగా వెయ్యి కోట్లు కేటాయిస్తానని.. బాధితులకు పక్కా ఇండ్లు నిర్మిస్తానని.. కరకట్ట ఎత్తు పెంచుతానని హామీలిచ్చారని.. అవి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు పోదెం వీరయ్య. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయాలని.. భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధు ప్రసాద్‌కు ఫిర్యాదును అందజేశారు.

Related News

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

Big Stories

Advertisement
×