Actress : సినిమాలలో స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న పలువురు హీరోయిన్లు బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. రీసెంట్ గా కంగనా రనౌత్ ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది. ఇక ఆమెకంటే ముందు చాలామంది హీరోయిన్లు ఇదే రంగంలో కొనసాగుతున్నారు. వారెవరో తెలుసుకుందాం.
కంగనా (Kangana Ranaut)- ది మౌంటెన్ స్టోరీ
ఇటీవల కంగనా తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, తన సొంత రెస్టారెంట్ గురించి సమాచారం ఇచ్చింది. ‘ది మౌంటైన్ స్టోరీ’ అనే పేరుతో ఈ రెస్టారెంట్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది. పేరుకు తగ్గట్టే ఈ రెస్టారెంట్ కూడా మౌంటైన్స్ లోనే ఉంటుంది. ఇక్కడ వాతావరణంతో పాటు పర్వతాలు, లోయలు వంటి అద్భుతమైన వ్యూను ఆస్వాదించవచ్చు. ఈ రెస్టారెంట్ లో నటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ వంటకాలతో పాటు స్థానిక వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి.
శిల్పా శెట్టి (Shilpa Shetty) – బాస్టియన్
శిల్పా శెట్టి ముంబైలోని బాస్టియన్ చైన్ రెస్టారెంట్ సహ యజమాని. ఆమె 2019 లో అందులో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ రెస్టారెంట్ బాలీవుడ్ తారలతో పాటు సామాన్యులకు కూడా ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి.కంప్లీట్ గా రాయల్ లుక్ లో ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుంది.
జూహి చావ్లా (Juhi Chawla) – రూ డు లిబన్
బాలీవుడ్ టాప్ నటీమణులలో జూహి చావ్లా ఒకరు. ఆమె తన భర్త జై మెహతాతో కలిసి ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఆ నటి రెస్టారెంట్ పేరు ‘రూ డు లిబన్’.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline fernandez) – కామ సూత్ర
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2 రెస్టారెంట్లను ప్రారంభించింది, వాటిలో ఒకటి శ్రీలంక రాజధాని కొలంబోలో, మరొకటి ముంబైలో ఉంది. కొలంబోలోని రెస్టారెంట్ పేరు కామసూత్ర. ఇదొక 5 స్టార్ హోటల్. ఆమె 2017 సంవత్సరంలో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది, అయితే 2018 సంవత్సరంలో జాక్వెలిన్ ముంబైలో పాలి థాలి అనే థాయ్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే మూసివేయాల్సి వచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ‘ఆరంభం’
రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో క్యూర్‌ఫుడ్స్ సహ యాజమాన్యంలోని మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్‌ను స్టార్ట్ చేసింది. రకుల్ రెస్టారెంట్ లో సాంప్రదాయ భారతీయ వంటకాలు, పోషకాహారం స్పెషల్. వీటిని భారత ప్రభుత్వం సూపర్‌ఫుడ్‌గా ప్రచారం చేస్తోంది.
సన్నీ లియోన్ (Sunny Leone)
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నోయిడాలోని ‘చికా లోకా’ అనే రెస్టారెంట్ ద్వారా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. ఇక్కడ ఆసియా వంటకాలు, సిగ్నేచర్ కాక్‌టెయిల్స్ వంటివి ఉంటాయి. సింగింగ్ బౌల్స్ హాస్పిటాలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఆమె హైదరాబాద్, గోవా, పంజాబ్‌లకు ఈ బిజినెస్ ను విస్తరించాలని యోచిస్తోంది.
మౌని రాయ్ (Mouni Roy) – బద్మాష్
మౌని రాయ్ కొత్త రెస్టారెంట్ పేరు బద్మాష్. ఇలా స్టార్ హీరోయిన్లుగా మారాక చాలామంది నటీమణులు రెస్టారెంట్ బిజినెస్ లో సత్తా చాటుతున్నారు.