BigTV English

Rythu Runamafi in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ.. బీఆర్ఎస్ నేతలకు బీపీ..!

Rythu Runamafi in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ.. బీఆర్ఎస్ నేతలకు బీపీ..!

Congress Government in Telangana Focus on Rythu Runa Mafi: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగవంతంగా సాగుతున్నాయి. వరుస వలసలతో బీఆర్ఎస్ నేతలు కుదేలవుతున్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే తమకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని ఆందోళన మొదలయింది. మరో పక్క అగ్ర నేతల చుట్టూ కేసులు ఆ పార్టీని మరింతగా కుంగదీస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే..ఇప్పడు బీజేపీ నేతలలో కొత్త తలనొప్పి మొదలయింది. అదే రైతు రుణ మాఫీ. గతంలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకున్న విషయం విదితమే. అయితే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగిపోతానని హరీష్ రావు ఆవేశపూరితంగా, పబ్లిక్ గా ఛాలెంజ్ చేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే రుణమాఫీని ఆగస్టు 15 లోగా చేసి తీరాలని కసిగా ఉన్నారు.


రుణమాఫీపై మార్గదర్శకాలు..

గత నెల రోజులుగా రుణమాఫీపై కసరత్తు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 2023 డిసెంబర్ నాటికి బకాయిలు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని చూస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన ఈ రుణాల మాఫీ ప్రక్రియ జరుగుతుందని ప్రకటించారు అధికారులు. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చేలా ఉన్నారు. ఆగస్టు 15 లోగా రైతు రుణ మాఫీని విజయవంతంగా పూర్తిచేసేలా ఉన్నారు.


బీఆర్ఎస్ లో మొదలైన ఆందోళన..

ఇప్పడు ఇదే అంశం బీఆర్ఎస్ నేతలను భయాందోళనలకు గురిచేస్తోంది. రుణమాఫీ విషయంలోరేవంత్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టాలని భావించిన బీఆర్ఎస్ నేతలకు ఎక్కడ తమ పరువు పోతుందో అని భయపడిపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు రుణ మాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. దీంతో అప్పట్లో రైతుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ రుణ మాఫీని అమలు చేసినట్లయితే రైతుల నుంచి తమ పార్టీకి మరింత వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరకాటంలో పెట్టాలా అని బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక హరీష్ రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారయింది. తాను అనవసరంగా రేవంత్ తో ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టడం తొందరపాటే అని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: Bogata Waterfalls: ఉప్పొంగి ప్రవహిస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న బోగత జలపాతం

ఇరికించాలని ఇరుక్కున్నారు..

హరీష్ రావు తాను చెప్పినట్లు రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? ఒకవేళ అదే జరిగితే కేసీఆర్ కుడిభుజం విరిగిపోయినట్లే. హరీష్ రావు తప్పించుకునే యత్నం చేస్తే కాంగ్రెస్ శ్రేణులు వదలరు. హరీష్ రావు ఇక ప్రజాక్షేత్రంలోతల ఎలా ఎత్తుకుంటారని అంటున్నారు. రుణమాఫీని విజయవంతం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి మరో మెట్టు ఎదిగినట్లేనని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఎలాగైనా రేవంత్ సర్కార్ ను ఇరికించాలని చూసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పడు తామే ఇరుక్కున్నామని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వెనకా ముందూ చూసుకోకుండా ఎదుటివారిని రెచ్చగొడితే ఫలితం ఇలానే ఉంటుందని బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాటంగానే హరీష్ రావు చర్యను ఖండిస్తున్నారు. అయితే కొంతకాలంగా హరీష్ రావు బీజేపీలోకి మారతారని ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ రుణ మాఫీ అమలైతే హరీష్ రావు పార్టీ మారతారా లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అంతా చర్చించుకుంటున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×