BigTV English

Congress in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. కాంగ్రెస్‌ విజయదుందుభి

Congress in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. కాంగ్రెస్‌ విజయదుందుభి
ts election result latest news

Congress in Khammam(TS election result latest news):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కనిపించింది. 10 స్థానాలకు గానూ కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందగా. పొత్తులో భాగంగా ఒక చోట సీపీఐ విజయం సాధించింది. మరోచోట బీఆర్ఎస్ గెలిచింది. మొదటిసారిగా భద్రాచలంలో గులాబీ జెండా ఎగిరింది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పాయం వెంకటేశ్వర్లు భారీ మెజార్టీతో గెలిచారు. మధిర నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన జిల్లా నేతలంతా మట్టికరిసిపోయారు. వాళ్లంతా ఘోరంగా ఓడిపోయారు.


పినపాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు 34వేల 506 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అశ్వారావుపేటలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుపై కాంగ్రెస్ నేత జారె ఆదినారాయణ 28వేల 905 ఓట్ల తేడాతో గెలిచారు. కొత్తగూడెంలో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు 26వేల 547 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్‌ అభ్యర్థి జలగం వెంకట్రావుపై గెలిచారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు 37వేల 555 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 57వేల 309 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలిచారు. పాలేరులో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 56వేల 478 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై గెలిచారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు మంత్రి పువ్వాడ అజయ్‌పై 49వేల 381 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మధిరలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 35452 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్‌పై గెలిచారు.


వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ మాలోత్ 33వేల 45 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌పై విజయం సాధించారు. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి 19వేల 463 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై గెలిచారు. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ 5వేల 719 ఓట్ల తేడాతో గెలిచారు. ఇతను పొంగులేటి వర్గానికి చెందిన నేత. ఎన్నికల ముందు పొంగులేటితోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేశారు. ఆ తర్వాత భద్రాచలం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే ఇస్తారని ఊహించి వెంటనే బీఆర్ఎస్‌లో చేరి టికెట్ సంపాదించారు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని పాలేరు నుంచి గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలుపొందిన వారిలో మొదటివారు, ఇల్లెందు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య రెండోవారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 3వ స్థానంలో నిలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టే వారిలో వైరా నుంచి మాలోతు రాందాస్‌ నాయక్‌, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణ, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడుగు పెట్టనున్నారు. ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచిన అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వయస్సులో పెద్దవారు కాగా అశ్వారావుపేట నుంచి గెలిచిన జారె ఆదినారాయణ పిన్న వయస్కులు. గెలుపొందిన అభ్యర్థులు ఆయా రిటర్నింగ్‌ అధికారుల నుంచి ఎమ్మెల్యేలుగా ధ్రువపత్రాలను అందుకున్నారు.

ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారని, వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పార్టీ పనిచేస్తుందన్నారు భట్టి విక్రమార్క, పొంగులేటి. అన్నివర్గాల ప్రజల కష్టాలను తీర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం ఎవరవుతారనే అంశాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

.

.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×