BigTV English

Congress : కేసీఆర్ కు రేవంత్ షాక్.. ఆ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు..

Congress : కేసీఆర్ కు రేవంత్ షాక్.. ఆ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు..

Congress : తెలంగాణలో తమ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో 12 మంది పార్టీ ఫిరాయించారు. ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, రేగా కాంతారావు, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హర్షవర్ధన్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇలా పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ నేతలు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తామిచ్చిన ఆధారాలు పరిశీలించాలని కోరారు. త్వరలో ఈడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పార్టీలో చేర్చుకున్నవారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


అంతకుముందు ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్‌ నేతలతో కూడిన బృందం సీఎల్పీలో చర్చించింది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరి ప్రభుత్వం నుంచి ఏయే పనులు చేయించుకున్నారు. వారి భూములు ఎక్కడెక్కడ రెగ్యులరైజ్ అయ్యాయి. ఈ అంశాలను సేకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎలా ప్రలోభాలకు గురి చేసింది అనే వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సంచలనం సృష్టించిన నలుగురు ఎమ్మెల్యేల ఎర కేసుపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ కూడా అక్కడే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ హైకోర్టులో కీలక దశలో ఉంది. ఈ కేసులో బీఆర్ఎస్ , బీజేపీ మధ్య న్యాయపోరాటం సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ఈ కేసును హైకోర్టు సీబీఐకు అప్పగించడం పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేయడం రాజకీయం రసవత్తరంగా మారింది.

ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అస్త్రంగా మార్చుకునే వ్యూహంతో కాంగ్రెస్ మొయినాబాద్ స్టేషన్ ను ఎంచుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారు. వీరంతా పార్టీని వీడి చాలా కాలం అయినా కాంగ్రెస్ ఈ విషయంలో ఇప్పుడు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.


కాంగ్రెస్ నిర్ణయంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన విధానంపై సమాధానం చెప్పాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
తామంతా రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ లో విలీనం అయ్యామని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 షెడ్యూల్ 4 ప్రకారం తాము బీఆర్ఎస్ లో విలీనం అయ్యామని వివరించారు. ఈ విషయంలో
రేవంత్ రెడ్డి డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఆర్థిక ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. మరి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతుందా? ఈ కేసు నిలబడుతుందా? ఏం జరుగుతుందో చూడాలి.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×