E-Paper
Advertisement

Congress : త్వరలో ఢిల్లీకి సీఎం సహా కేలక నేతలు..వారి పదవులు ఔట్?

Congress : త్వరలో ఢిల్లీకి సీఎం సహా కేలక నేతలు..వారి పదవులు ఔట్?
Advertisement

రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళంలో ప్రభుత్వాలు కొలువుదీరాక ఏఐసీసీ తెలంగాణ రాజకీయంపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. తమిళనాట విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించినా అక్కడ మెజార్టీ కోసం ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఇక కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాగా.. త్వరలోనే సీఎంగా కేసీ వేణుగోపాల్ ప్రమాణం చేస్తారని తెలిసింది. మరో రెండ్రోజుల్లో ఈ తతంగం అంతా పూర్తికానుంది. ఆ తర్వాత ఏఐసీసీ నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు వస్తుందని టాక్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లు
ఢిల్లీకి వెళతారని తెలుస్తున్నది.

కీలక నేతలతో భేటీ..

రాష్ట్రం నుంచి వెళ్లిన కీలక నేతలతో ఏఐసీసీ పెద్దలు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై గల అసంతృప్తులు, పెండింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై ఏఐసీసీ నేతలు ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం. ఆ తర్వాత పెండింగ్ కేబినెట్ పోస్టుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరిని తప్పించాలనే అంశంపై సీఎం అభిప్రాయం ప్రధానంగా కోరనున్నట్టు తెలుస్తోంది.

ఒకరు లేదా ఇద్దరు ఔట్..

Advertisement

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ , శాఖల మార్పు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేరళంలో ప్రభుత్వం కొలువుదీరాక మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానుంది. ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యాక వారు ఏం చెప్తారు? ఇక్కడి నేతల అభిప్రాయాలకు ఎంత వరకు విలువనిస్తారు? అనేది తెలియాల్సి ఉన్నది. ఆ తర్వాత రాష్ట్రంలోని కీలక నేతల అభిప్రాయాల సేకరణలో వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొత్తగా ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాలి? ఎవరికి ఉద్వాసన పలుకాలి అనే దానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. దీంతో కేబినెట్ మంత్రుల్లో ఎనలేని భయాందోళన కనిపిస్తున్నది. తమ మంత్రి పదవులు ఉంటాయా? పోతాయా? అని సీఎం సన్నిహితుల ద్వారా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ పై లైలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

Advertisement

కొందరైతే తమకు కొత్తగా మంత్రి వర్గంలో చాన్స్ కల్పించాలని ఏఐసీసీ లెవల్లో లాబీయింగ్ చేస్తుండగా.. మరికొందరైతే తమకు అన్యాయం చేయొద్దని, మంత్రి పదవి పోకుండా చూడాలని జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా మరో వారంలోగా మంత్రుల భవితవ్యం తేలిపోనుందని టాక్. అలాగే శానససభ సభ్యుల భవితవ్యం సైతం తేలనుందని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ రెండేండ్లలో వారు ఏం చేశారో నివేదికలు తెప్పించుకుని పార్టీకి అనవసరం అనుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏఐసీసీ నేతల ముందు ప్రపోజల్ పెట్టాలని సీఎం రేవంత్, మిగతా సీనియర్లు భావిస్తున్నట్టు ప్రచారం జగుతోంది. అదే జరిగితే ఎంతమంది పదవులు ఉంటాయా? పోతాయా? తెలియాల్సి ఉంది.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×