E-Paper
Advertisement

సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మృతి.. అసలేమైందంటే?

సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మృతి.. అసలేమైందంటే?
Advertisement

Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకవైపు వరుస శుభవార్తలు.. మరొకవైపు వరుస విషాదాలు అభిమానులను అతలాకుతలం చేస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న ప్రముఖ నటుడు జీవా తండ్రి , ప్రముఖ నిర్మాత ఆర్. బి చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఇప్పుడు మరొక నిర్మాత కన్నుమూశారు. ఒక సామాన్య ప్రొడక్షన్ మేనేజర్ గా కెరియర్ ప్రారంభించి.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి నేడు టాలీవుడ్ లో నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని పొందుపరచుకున్న కాకర్ల కృష్ణ నేడు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్లో తన స్వగృహంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇకపోతే ఈయన వయోభారంతో మృతి చెందినట్లు సమాచారం.

ప్రముఖ నిర్మాత మృతి..

సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మరణ వార్త సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన కాకర్ల కృష్ణ మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది . ఇక ప్రస్తుతం ఆయన మరణం పై పలువురు సెలబ్రిటీలు, నెటిజన్స్ , అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

కాకర్ల కృష్ణ సినీ ప్రయాణం…

Advertisement

కాకర్ల కృష్ణ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రముఖ నిర్మాత వీ.బి.రాజేంద్రప్రసాద్ ప్రతిష్టాత్మక ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ గా చేరారు. అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ తనదైన శైలిలో సత్తా చాటారు. ఇక ఆ అనుభవంతోనే 1974లో కే. సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ , చంద్రకళ, అంజలీదేవి ప్రధాన తారాగణంగా వచ్చిన ‘ఇంటింటి కథ’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఇక తర్వాత ఏడంతస్తుల మేడ, రాగ దీపం , ఊరంతా సంక్రాంతి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా పనిచేశారు.

also read:విజయ్ దళపతి 10వ తరగతి మార్క్స్ మెమో వైరల్.. ఆ సబ్జెక్టులో మరీ అంత వీకా?

కాకర్ల కృష్ణ సినిమా స్వర్ణోత్సవం..

Advertisement

ఇకపోతే కాకర్ల కృష్ణ నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైన ఇంటింటి కథ సినిమా విడుదలై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2023లో స్వర్ణోత్సవ వేడుకలు కూడా జరిగాయి. ఇకపోతే కృష్ణ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా చాలా చురుకుగా పాల్గొనేవారు. ఫిలింనగర్ గృహ నిర్మాణ సంస్థలో , వీ.బి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభమైన ఫిలింనగర్ దైవ సన్నిధానంలో కూడా కమిటీ సభ్యుడిగా ఉండి ఎనలేని సేవలను అందించారు కృష్ణ . ఇక అలాంటి ఈయన నేడు మన మధ్య లేకపోవడంతో ప్రతి ఒక్కరూ దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు.

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×