BigTV English

Congress: జూపల్లి ముందుకి.. పొంగులేటి వెనక్కి.. ‘కేసీఆర్‌ హఠావో- తెలంగాణ బచావో’

Congress: జూపల్లి ముందుకి.. పొంగులేటి వెనక్కి.. ‘కేసీఆర్‌ హఠావో- తెలంగాణ బచావో’
TCong rahul gandhi

Congress News Telangana(Latest breaking news in telugu): కాంగ్రెస్ పార్టీకి బిగ్ డే. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సందడే సందడి. అది హస్తిననా.. తెలంగాణా? అన్నట్టు నెలకొంది కోలాహలం. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు. పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు రాహుల్, ఖర్గేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు రాహుల్‌ను ఆహ్వానించారు.
అయితే, పార్టీ రిలీజ్ చేసిన చేరికల జాబితాలో జూపల్లి కృష్ణారావు పేరు అందరికంటే ముందు ఉండగా.. పొంగులేటి పేరు మాత్రం ఏకంగా 15వ నెంబర్‌లో చేర్చడాన్ని మీడియా హైలైట్ చేస్తోంది.


కాంగ్రెస్‌లో ‘ఘర్ వాపసీ’ జరుగుతోందని అన్నారు రాహుల్‌గాంధీ. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు. ‘కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంలో ముందుకెళ్లాలని నేతలకు రాహుల్‌గాంధీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. పార్టీ నేతలంతా సమష్ఠిగా పోరాడాలని పిలుపు ఇచ్చారు రాహుల్‌.

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఢిల్లీలో ఈ భారీ కార్యక్రమం జరిగింది. రేవంత్‌తో పాటు.. కేసీ వేణుగోపాల్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, అరికెల నర్సారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు ఉన్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×