E-Paper
Advertisement

Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్

Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్
Advertisement

Minister Azharuddin: జహీరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్  (Minister Azharuddin)పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ వెళ్తుంటారని వివరించారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదన్న సామెతల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రులతో కలిసి అభివృద్ధి ఫలాల కోసం ప్రయత్నిస్తుంటారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ ఉజ్వల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మంగళవారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎండి.యునుస్, వైస్ చైర్మన్ కొత్తకాపు శిరీష, కౌన్సిల్లర్లను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలన్నారు.

Also Read: Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం చైర్మన్​ ఎన్నిక మళ్లీ వాయిదా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ!

జహీరాబాద్ కాంగ్రెస్ అడ్డా

Advertisement

తాను క్రికెట్ లో ఎన్నో సెంచరీలు కొట్టానని, ఇప్పుడు స్థానికులు సెంచరీ బాది కాంగ్రెస్ ను గెలిపించారని చమత్కారంగా అన్నారు. ఎన్నికల ఇంచార్జి, రాష్ట్ర టిఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఫయుమ్ ఖురేషీ మాట్లాడుతూ సిఎం కోరిక మేరకు మైనారిటీ చైర్మన్ ను చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. జహీరాబాద్ మున్సిపల్ లో పాలకమండలి మొత్తం యంగ్ స్టార్లు ఉన్నారని, వార్డుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు.

ఎనిమిది మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా

ఎంపి సురేష్ కుమార్ శెట్కార్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఎనిమిది మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం సంతోషకరమన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ మంత్రి, ఇంచార్జి ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపల్ లను కాంగ్రెస్ కైవసం చేసుకుందని, గెలుపుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎస్. ఉజ్వల్ రెడ్డి, తన్వీర్,ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, సిడిసి చైర్మన్ ముభిన్,ఎంఐఎం ఇంచార్జి అత్తర్ అహ్మద్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె. నర్సింలు, పీ. నర్సింహారెడ్డి, హన్మంత్ రావుపాటిల్, బి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×