E-Paper
Advertisement

స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్

స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్
Advertisement

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మడుమలంచ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 260 మంది విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత పదేళ్లుగా ఈ బడిలో కనీసం ఒక్క మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడం పాలకులు, అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. రోజువారీ అవసరాల కోసం విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. బహిర్భూమి కోసం బడి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి రావడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రాణభద్రతను కూడా తీవ్ర ప్రమాదంలో పడేస్తోంది. నేటి కాలంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక శౌచాలయ వసతులు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. వర్షాకాలంలో పాములు, కీటకాల భయంతో పిల్లలు వణుకుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి మడుమలంచ పాఠశాలలో సరిపడా మరుగుదొడ్లను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×